Mithun Reddy: ఆస్తుల్లో టాప్.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
ABN , Publish Date - Jan 07 , 2026 | 08:11 PM
వైసీపీ నేత, రాజంపేట సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి 2014 నుంచి 2024 వరకు తన ఆస్తులకు సంబంధించిన వివరాలు ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఆ వివరాలివీ...
ఢిల్లీ: ఏపీ రాజకీయాల్లో సిట్టింగ్ ఎంపీ మిథున్‌రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇటీవల పలు కుంభకోణాలు, కేసుల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. పీవీ.మిథున్ రెడ్డి 2014 నుంచి 2024 వరకు తన ఆస్తులకు సంబంధించిన వివరాలు ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఈ మధ్య కాలంలో ఆయన సంపద.. భారీ స్థాయిలో పెరిగినట్లు తెలుస్తోంది. 2014లో ఆయన పార్లమెంట్‌కు పోటీ చేసినపుడు ఆస్తుల విలువ రూ.22.59 కోట్లు. 2024 ఎన్నికల నాటికి వాటి విలువ ఏకంగా రూ.146.85 కోట్లకు చేరుకుంది. అంటే పదేళ్ల కాలంలో ఆయన ఆస్తులు దాదాపు రూ.124.25 కోట్ల వరకు పెరిగింది. ఎంపీల ఆస్తుల పెరుగుదల జాబితాలో మిథున్‌రెడ్డి రెండో స్థానంలో నిలిచారు.
2014 నుంచి 2019 వరకు అంటే ఐదేళ్లలో మిథున్ ఆస్తులు రూ.44 కోట్లు పెరగగా.. ఆ తర్వాత వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రూ.80 కోట్లకు పైగా పెరిగింది. ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. రూ.47.54 కోట్ల చరాస్తులు, రూ.99.30 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. అదే సమయంలో రూ.56.09 కోట్ల వరకు అప్పులు కూడా ఉన్నట్లు అఫిడవిట్‌లో సమర్పించారు. మొత్తానికి ఆయన ఎంపీగా ఉన్న కాలంలో ఆస్తులు దాదాపు 550 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
వేడెక్కిన తమిళ రాజకీయాలు.. ఎన్డీయే కూటమిలో చేరిన పీఎంకే
పశ్చిమ దేశాల కపటత్వంపై జైశంకర్ సీరియస్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
2014 నుంచి 2024 లోక్ సభ ఎన్నికల మధ్య తిరిగి ఎన్నికైన ఎంపీల ఆస్తుల వివరాలను విశ్లేషణను ఢిల్లీలోని స్వతంత్ర వాచ్‌డాగ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నిర్వహించింది. ఇటీవల ఏపీలో మద్యం కుంభకోణం కేసు పెను సంచలనాలు సృష్టించింది. రూ.32 వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి కూడా నిందితుడన్న విషయం తెలిసిందే. ఈ కేసులో 2024 జులైలో అరెస్ట్ అయి, 2024 సెప్టెంబర్‌లో బెయిల్ పై విడుదలయ్యారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు.