Home » Delhi
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న వారిని ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటున్నారు. వారినుంచి వివరాలు సేకరిస్తున్నారు.
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో దర్యాప్తు బృందాలు దర్యాప్తును వేగవంతం చేశాయి. సోమవారం ఎర్ర కోట దగ్గర బాంబు దాడికి పాల్పడింది ఉమరేనని దర్యాప్తులో తేలింది. ఐ20 కారు దగ్గర సేకరించిన డీఎన్‌ఏతో నిందితుడు ఉమర్ నబి బంధువుల నుంచి సేకరించిన డీఎన్ఏ సాంపిల్స్‌తో మ్యాచ్ అయ్యాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 7 లోక్‌కల్యాణ్ మార్గ్‌లో బుధవారం సాయంత్రం 7 గంటలకు కేంద్ర కేబినెట్ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. సుమారు రెండు గంటల సేపు ఈ సమావేశం జరిగింది.
ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన భయంకర బ్లాస్ట్ కారకుల్ని గుర్తించేందుకు పోలీసులు దేశాన్ని జల్లెడపడుతున్నారు. విస్పోటన కారకుల గురించి దర్యాప్తు సంస్థలు, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఒక కీలకమైన విషయాన్ని కనుగొన్నారు.
ఢిల్లీ పేలుడు ఘటనతో సంబంధం ఉన్న జైష్ మాడ్యూల్ నుంచి పోలీసులు రాబట్టిన సమాచారం ప్రకారం టెర్రర్ ఆపరేటివ్స్ అయిన డాక్టర్ ఉమర్, అమీర్‌లు ఢిల్లీ నుంచి మరో రెండు కార్లు సేకరించినట్టు బయటపడింది.
ఎర్రకోట వద్ద జరిగిన 10/11 బ్లాస్ట్‌లో మసూద్ అజార్ ప్రమేయంపై మరోసారి అనుమానాలు బలపడుతున్నాయి. హుండాయ్ ఐ20 కారులో నవంబర్ 10న జరిగిన పేలుడు ఘటన వెనుక జైషే మహ్మద్ ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు వెలుగుచూస్తున్నాయి.
రెండ్రోజుల భూటాన్ పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధాని ఆ వెంటనే లోక్‌నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి వెళ్లారు. బాధితులతో నేరుగా మాట్లాడి త్వరగా కోలుకోవాలని అభిలషించారు.
ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం జరిగిన దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట క్రాసింగ్ సిగ్నల్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుళ్ల ఘటనకు సంబంధించి నిందితుడు ముజామ్మిల్ కీలక విషయాన్ని బయటపెట్టాడు. నిజానికి తాము దీపావళికే ప్లాన్ చేశామని, కానీ అమలు చేయడంలో విఫలమైనట్టు అతడు విచారణలో చెప్పాడు.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుళ్లు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. పేలుళ్లకు రెండు రోజుల ముందు గుజరాత్‌లో యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మహ్మద్ మోహియుద్దిన్ ఉండటం చర్చనీయాంశమైంది.