Share News

అలాంటి వారికి దేశ రాజకీయాల్లో చోటులేదు: నితిన్ నబీన్

ABN , Publish Date - Jan 20 , 2026 | 03:22 PM

నితిన్ నబీన్ సిన్హా ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమిళనాడు ప్రభుత్వం తిరుప్పరన్కుండ్రం కొండపై కార్తీగై దీపం పండుగ జరగకుండా ఆపడాన్ని ఆయన తప్పుబట్టారు. సోమనాథ్, రామ సేతు, ఇతర చిహ్నాల గురించి మాట్లాడితే ప్రతిపక్ష పార్టీలు అసహనానికి గురవుతాయన్నారు.

అలాంటి వారికి దేశ రాజకీయాల్లో చోటులేదు: నితిన్ నబీన్
Nitin Nabin

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఆయన జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. భారత్ మాతాకీ జై అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన ఆయన.. ‘ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక సాధారణ కార్యకర్తనైన నన్ను పార్టీలోనే అత్యంత ఉన్నతమైన పదవికి చేరేలా చేశారు. నేను మీకు తలవంచి నమస్కరిస్తున్నాను’ అని అన్నారు.


ప్రధాని మోదీపై ప్రశంసలు..

జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా.. ప్రధాని మోదీపై ప్రశంసల జల్లులు కురిపించారు. ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధాని మోదీ నిరంతరంగా దేశం కోసం పాటుపడుతున్న తీరును సాధారణ కార్యకర్తలమైన తాము గమనిస్తూనే ఉన్నామన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘అది నేను నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్న సమయం. అప్పుడు మీరు(ప్రధాని మోదీ) సభావన మిషన్ ప్రోగ్రామ్ సందర్భంగా ప్రతీ ఒక్కరి కష్టాలను అడిగి తెలుసుకోవటం చూశాను. ఆ ప్రోగ్రామ్ తర్వాత మేము మీ గ్రీన్ రూములో మిమ్మల్ని కలిశాము. గుజరాత్ నుంచి చాలా మంది ఆ ప్రోగ్రామ్‌కు ఎందుకు వస్తున్నారో భావోద్వేగపూరితంగా మీరు మాకు వివరించారు. ప్రజల ఎమోషన్స్‌తో కనెక్ట్ అయ్యే వారే గొప్ప నాయకులు అవుతారని నాకు అప్పుడు అర్థమయింది’ అని చెప్పారు.


ఈ సందర్భంగా నితిన్ నబీన్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమిళనాడు ప్రభుత్వం తిరుప్పరన్కుండ్రం కొండపై కార్తీగై దీపం పండుగ జరగకుండా ఆపడాన్ని ఆయన తప్పుబట్టారు. సోమనాథ్, రామ సేతు, ఇతర చిహ్నాల గురించి మాట్లాడితే ప్రతి పక్ష పార్టీలు అసహనానికి గురవుతాయని అన్నారు. రామ సేతు లేదు అనే వారికి, కార్తీగై దీపం పండుగను అడ్డుకునే వారికి భారత రాజకీయాల్లో చోటులేదని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

రో- కోకు డిమోషన్.. సెంట్రల్ కాంట్రాక్టుల్లో ‘బి గ్రేడ్’?

మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న పావురాన్ని 15 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 20 , 2026 | 03:36 PM