ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం.. లగేజీలో అస్థిపంజరం..
ABN , Publish Date - Jan 22 , 2026 | 04:31 PM
ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భద్రతా తనిఖీల సమయంలో ఓ ప్రయాణికుడి లగేజీలో అస్థిపంజరం లభ్యమైంది. ఈ ఘటనతో టెర్మినల్–3 వద్ద కలకలం నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భద్రతా తనిఖీల సమయంలో ఓ ప్రయాణికుడి లగేజీలో అస్థిపంజరం కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. గురువారం టెర్మినల్–3 వద్ద బ్యాగేజీ స్కానింగ్ జరుగుతున్న సమయంలో ఈ అస్థిపంజరం బయటపడింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఢిల్లీ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
డెమో అస్థిపంజరం
పోలీసుల ప్రాథమిక విచారణలో.. ఆ బ్యాగ్ ఢిల్లీ నుంచి ప్రయాణిస్తున్న ఒక వైద్య విద్యార్థికి చెందినదిగా గుర్తించారు. బ్యాగులో ఉన్నది వైద్య విద్యలో ఉపయోగించే డెమో అస్థిపంజరం అని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో ఎలాంటి నేరానికి సంబంధం లేదని, అనుమానాస్పద పరిస్థితులు లేవని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అయినప్పటికీ అది నిజమైన మనిషి అస్థిపంజరమా లేదా విద్యా ప్రయోజనాల కోసం ఉపయోగించే నమూనానా అనే విషయాన్ని పూర్తిగా నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత దీనిపై నిజానిజాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News