ఫోన్ ట్యాపింగ్.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పై ఎంపీ లక్ష్మణ్ విమర్శలు
ABN , Publish Date - Jan 20 , 2026 | 03:58 PM
ఫోన్ ట్యాపింగ్‌పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. రెండేళ్లయినా ఫోన్ ట్యాపింగ్ దోషులెవరో తేల్చలేదని విమర్శలు గుప్పించారు.
న్యూఢిల్లీ, జనవరి 20: ఫోన్ ట్యాపింగ్‌పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్(BJP MP Laxman) స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ అయిందని తెలంగాణ మొత్తం కోడై కూస్తోందని ఎంపీ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కవిత కుటుంబ సభ్యుల ఫోన్లూ ట్యాప్ అయ్యాయని.. ఈ విషయమై కవితే స్వయంగా చెప్పారన్నారు. ముందు.. కవిత మాటలకు బీఆర్‌ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని అనుమానాలు వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై ప్రజలకు విశ్వాసం లేదన్నారు ఎంపీ లక్ష్మణ్. వారి అంతర్గత కలహాలతో ఆయా నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. దర్యాప్తులతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న దోషులు, బాధ్యులు ఎవరో నిర్ధారించకుండా రెండేళ్లు పూర్తి చేశారంటూ ఎద్దేవా చేశారు.
బీఆర్‌ఎస్.. కలహాలతో ముక్కలైపోయిందని, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని లక్ష్మణ్ అన్నారు. కవిత ఆరోపణలపై బీఆర్‌ఎస్ నేతలు ఎందుకు మాట్లాడడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోల్ బ్లాక్‌పై న్యాయపోరాటం కూడా చేసే అవకాశముందని చెప్పారు. బీఆర్ఎస్ తిన్న మొత్తాన్ని కక్కిస్తామని రేవంత్ రెడ్డి అన్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ పూర్తి దర్యాప్తు చేయాలని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు సీరియస్..
చట్టాల మీద గౌరవంతోనే సిట్ విచారణకు హరీశ్: న్యాయవాది చంద్రశేఖర్
Read Latest Telangana News And Telugu News