ఢిల్లీలో రోడ్డు ప్రమాదం..19 ఏళ్ల యువతి మృతి
ABN , Publish Date - Jan 20 , 2026 | 05:23 PM
ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 19 ఏళ్ల యువతి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ ట్రక్కును ఓవర్ టేక్ చేస్తుండగా.. కారు ప్రమాదానికి గురైంది.
ఢిల్లీ, జనవరి20: నొయిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 ఏళ్ల యువతి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారు జాము సమయంలో నొయిడా- భంగేల్ మార్గంలో జాగ్వార్ కారు ప్రమాదానికి గురైంది. ఓ ట్రక్కును ఓవర్ టేక్ చేసే క్రమంలో కారు డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రక్కుకు, రోడ్డు డివైడర్‌కు మధ్య కారు నలిగి పోయింది. ప్రమాదానికి గురైన కారులో ఫలక్ అహ్మద్ (19), అన్ష్ (19), ఆయుష్ భాటి (17), మరియు నీల్ పన్వార్ (18) అనే నలుగురు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరికి తీవ్ర గాయాలు కావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ ఫలక్ అనే యువతి మృతి చెందింది. మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో కారును ఎవరు నడుపుతున్నారనే దానిపై స్పష్టత రాలేదు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపిన పోలీసులు.. సమాచారాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అందించారు. ఈ ప్రమాద తీవ్ర ఎంత ఉందంటే కారు డ్రైవర్ వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ట్రక్కు డ్రైవర్ సంఘటనా స్థలం నుండి పారిపోయాడని, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
నితిన్ నబీన్‌కు జడ్ కేటగిరీ సెక్యూరిటీ
బీజేపీ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవం.. అతి పిన్న వయస్కుడిగా రికార్డు