Home » Delhi
18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల నాయకులతో వరుస ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. మలేషియా, ఇథియోపియా, వియత్నాం, యూఏఈ, ఇరాన్, చైనా అగ్రనేతలతో ప్రధాని మోదీ సమావేశాలు జరుపుతున్నారు.
బ్రిక్స్ సదస్సులో చారిత్రక పురోగతి నమోదైంది. సదస్సులో భాగంగా రూపొందించిన 'న్యూఢిల్లీ డిక్లరేషన్'కు కూటమిలోని సభ్య దేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. బ్రిక్స్ కూటమి ప్రయాణంలో ఇది కీలక ఘట్టమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.
బ్రిక్స్ కూటమి ఏ రకమైన పాశ్చాత్య లేదా ఇతర వర్గానికి వ్యతిరేకంగా పనిచేసే వేదిక కాదని, అందరినీ కలుపుకొనిపోయే భాగస్వామ్య వేదిక అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భారత్ బ్రిక్స్ అధ్యక్షత వహించడంలో 'మానవాభివృద్ధే కీలకం' అనే నమూనాను అనుసరిస్తోందన్నారు.
బ్రిక్స్ అతిథుల కోసం జైపూర్‌కు చెందిన అరుణ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రత్యేక వెండి టేబుల్‌వేర్, కట్లరీని సిద్ధం చేసింది. భారతీయ ఆతిథ్య సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వీటిని ప్రత్యేక డిజైన్లతో రూపొందించింది.
చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ శనివారం ఉదయం భారత్‌కు చేరుకున్నారు. ఏడేళ్ల తరవాత ఢిల్లీలో ఆయన అడుగుపెట్టారు. దేశ రాజధాని వేదికగా శని, ఆదివారం జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొననున్నారు.
బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఐటీసీ మౌర్య హోటల్ ప్రత్యేక ఆతిథ్యం సిద్ధం చేసింది. రష్యా సంస్కృతిని ప్రతిబింబించే మ్యాట్రియోష్కా బొమ్మల ఆకారంలోని చాక్లెట్లతో పాటు.. భారతీయ సంప్రదాయ రుచులతో ప్రత్యేక థాలీని కూడా తయారు చేసింది.
ఢిల్లీలో జరుగుతున్న BRICS 2026 సమ్మిట్ వేళ ఏర్పాటు చేసిన 'BRICS బిజినెస్ ఫోరమ్'లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు, వ్యాపార భాగస్వామ్యాల ప్రాధాన్యత గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ నాయకుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
బ్రిక్స్ సమ్మిట్ వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్-ప్రధాని మోదీ ప్రత్యేక అధికారిక వాహనమైన 'ఔరస్ సెనాట్' ఆర్మర్డ్ లిమోజిన్‌లో ప్రయాణించారు. ఈ కారు చలించే ఓ ఉక్కుకోటగా పేరు పొందింది. ఇంతకీ ఏమిటా దుర్భేద్యమైన కారు ప్రత్యేకత?
BRICS సమ్మిట్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన ద్వైపాక్షిక భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు పురాతన తమిళ సాహిత్య కావ్యమైన 'తిరుక్కురళ్' రష్యన్ అనువాద ప్రతిని బహుమతిగా అందించారు.