దారుణం.. చెంప దెబ్బ కొట్టాడని కాల్చి చంపాడు
ABN , Publish Date - Jan 25 , 2026 | 08:41 AM
ఈ మధ్య కాలంలో క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. గతంలో తనను చెంపదెబ్బ కొట్టాడన్న కక్షతో ప్రత్యర్థిని కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో దారుణ సంఘటన జరిగింది. వెల్కమ్ ప్రాంతానికి చెందిన ఫైజాన్ అలియాస్ ఫజ్జీ(24) అనే యువకుడు కేఫ్‌లో ఉండగా అతన్ని దారుణంగా కాల్చారు. దీంతో అక్కడే కుప్పకూలిపోయిన ఫజ్జీని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే హంతకుడు ఇన్‌స్ట్రాగామ్‌లో తన నేరాన్ని అంగీకరించడం సంచలనంగా మారింది.
‘వ్యక్తిగత కక్షతో నేను ఫైజాన్ ను హత్య చేశాను. ఇందులో నా తండ్రి పాత్ర లేదు, నా కుటుంబం, స్నేహితులకు దీనితో ఎలాంటి సంబంధం లేదు. ఎవరి మాట విని నేను అతన్ని చంపలేదు, డబ్బు కూడా ఎవరూ ఇవ్వలేదు. ఫైజాన్ నాలుగు నెలల క్రితం నన్ను చెంపదెబ్బ కొట్టి అవమానించాడు, ఆ కక్షతోనే అతని ప్రాణం తీశాను’ అని వీడియోలో చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
బ్రెజిల్ ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్నా: ప్రధాని మోదీ
తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్ భారత్