భారత్‌ది డెడ్ ఎకానమీ.. ప్రధాని మోదీదే బాధ్యత: రాహుల్ గాంధీ విమర్శలు
ABN , Publish Date - Jan 23 , 2026 | 06:44 PM
భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి 'డెడ్ ఎకానమీ' అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి వ్యాఖ్యానించారు. భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధించడం, దేశంలో వస్త్ర పరిశ్రమను రక్షించడానికి కేంద్రం చర్యలు తీసుకోకపోవడం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.
భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి 'డెడ్ ఎకానమీ' అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి వ్యాఖ్యానించారు. భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధించడం, దేశంలో వస్త్ర పరిశ్రమను రక్షించడానికి కేంద్రం చర్యలు తీసుకోకపోవడం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. భారత ఆర్థిక వ్యవస్థ దిగజారిపోవడానికి ప్రధాని మోదీదే పూర్తి బాధ్యత అని రాహుల్ గాంధీ విమర్శించారు (Rahul Gandhi dead economy).
'భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించడం వస్త్ర పరిశ్రమను దారుణంగా దెబ్బతీసింది. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఉద్యోగాలు పోయాయి. ఆర్డర్లు తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల వల్ల మన ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'గా మారింది. 4.5 కోట్ల ఉద్యోగాలు, లక్షల వ్యాపారాలు సందిగ్ధంలో పడినా ప్రధాని మోదీ స్పందించడం లేదు. సుంకాల గురించి కనీసం మాట్లాడడం లేదు. మోదీజీ.. దీనికి పూర్తి బాధ్యత మీదే. దయచేసి దీని మీద దృష్టి పెట్టండి' అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు (Congress attack on Modi).
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది (BJP Congress clash). రాహుల్ ఆరోపణలను ఖండిస్తూ బీజేపీ నేతలు విమర్శలు చేశారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, బీజేపీ హయాంలో 9 కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగిందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని, వస్త్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతోందని అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ వైపు అమెరికా నౌకాదళం.. ఇజ్రాయెల్‌లో హై అలర్ట్..
ట్రంప్ తీరు వల్ల అమెరికా ఇతర దేశాల విశ్వాసం కోల్పోతోంది.. జేపీ మోర్గాన్ విమర్శలు..