Home » Delhi
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ సీజేపీ ఉద్యమానికి సిద్ధమైంది. 24 గంటల్లో ఆయన రాజీనామా చేయాలని సీజేపీ ఆల్టిమేటం జారీ చేసింది.
బీజేపీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌లు, కో-ఇన్‌ఛార్జ్‌లను అధిష్ఠానం నియమించింది.
ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్, ప్రియాంక తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో అక్రమాలు జరగడానికి సహకరిస్తే అది ప్రజాస్వామ్యంపై జరిగే తీవ్రమైన దాడిగా అభివర్ణించారు.
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 కొత్త చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో భిన్న తీర్పు వెలువడింది.
కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాలు తలెత్తాయన్న వార్తలను ఈసీ వర్గాలు తోసిపుచ్చాయి. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని ముగ్గురు ఎన్నికల కమిషనర్ల మధ్య ఎలాంటి విభేదాలూ లేవని స్పష్టం చేశాయి.
దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగానికి అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీలో రేపు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఏఎన్‌టీఎఫ్ చీఫ్‌ల జాతీయ సదస్సును నిర్వహించనుంది.
ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి చుక్కెదురైంది. ఆమె ఓటరు నమోదు వివాదంలో ఢిల్లీ సెషన్స్ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ హైకోర్టు తనపై విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ 2026 ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ABVP అత్యధిక స్థానాలను గెలుచుకుని తన ఆధిక్యాన్ని చాటుకుంది. ప్రెసిడెంట్ సహా మూడు కీలక స్థానాలను కైవసం చేసుకుంది.
దేశవ్యాప్తంగా నిర్వహించిన 20వ 'రోజ్‌గార్ మేళా'లో 51వేల మందికి పైగా యువతకు కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వర్చువల్‌గా ప్రసంగించిన ప్రధాని మోదీ.. దేశాన్ని 'వికసిత్ భారత్'గా మార్చడంలో యువతదే కీలక పాత్రన్నారు.