Share News

పరీక్షాపే చర్చా.. స్పెషల్ ఎపిసోడ్ తప్పక చూడాలన్న మోదీ

ABN , Publish Date - Feb 06 , 2026 | 11:37 AM

ప్రధాని అధికారిక నివాసంలో దేశంలోని దేవ్‌మోగ్రా, కోయంబత్తూర్, రాయ్‌పూర్, గువాహటి, ఢిల్లీ నుంచి ఎంపికైన ఎగ్జామ్ వారియర్స్‌.. మోదీతో ముచ్చటించారు. సుమారు 4.50 కోట్ల మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని 15 నిమిషాలు ప్రసంగించారు.

పరీక్షాపే చర్చా.. స్పెషల్ ఎపిసోడ్ తప్పక చూడాలన్న మోదీ
PM Modi student meeting

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: పరీక్షాపే చర్చా కార్యక్రమంలో భాగంగా కొంతమంది విద్యార్థులు భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. శుక్రవారం ప్రధాని అధికారిక నివాసంలో.. దేశంలోని దేవ్‌మోగ్రా, కోయంబత్తూర్, రాయ్‌పూర్, గువాహటి, ఢిల్లీ నుంచి ఎంపికైన ఎగ్జామ్ వారియర్స్‌.. మోదీతో ముచ్చటించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ప్రధాని సమాధానం ఇచ్చారు. ‘ప్రతి ఒక్కరి ఆలోచనా విధానంలో తేడా ఉంటుంది. పరీక్షలను పండుగలా చేసుకోవాలి. మీతో మీరు పోటీపడాలి’ అని అన్నారు.


సుమారు 4.50 కోట్ల మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ 15 నిమిషాలు ప్రసంగించారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ‘పరీక్షలను సానుకూలంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం గురించి విద్యార్థులతో అద్భుతమైన చర్చ జరిగింది. ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను అందరూ తప్పకుండా చూడాలి’ అని రాసుకొచ్చారు.


ఇవి కూడా చదవండి

నేను.. జాతరకు దూరంగా ఉండలేదు..

రూట్ మార్చిన జగన్.. అసలు విషయమిదే.

Updated Date - Feb 06 , 2026 | 12:41 PM