బరితెగించిన ట్రాన్స్‌జెండర్.. డబ్బులు ఇవ్వలేదని యువతిపై గుట్కా ఉమ్మేసింది
ABN , Publish Date - Feb 04 , 2026 | 01:02 PM
దేశ రాజధాని ఢిల్లీలో ఓ ట్రాన్స్‌జెండర్ రెచ్చిపోయి ప్రవర్తించింది. డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ యువతి ముఖంపై గుట్కా ఉమ్మేసింది. ట్రాన్స్‌జెండర్.. యువతిపై గుట్కా ఉమ్మేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటర్‌నెట్ డెస్క్: డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ ట్రాన్స్‌జెండర్ దారుణానికి పాల్పడింది. అమ్మాయి ముఖంపై గుట్కా ఉమ్మేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో స్టేషన్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఓ యువతి మెట్రో స్టేషన్‌లో రీల్ కోసం సెల్ఫీ వీడియో రికార్డు చేస్తోంది. ఇంతలో ఓ ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు యువతి దగ్గరకు వచ్చారు. టీషర్ట్ వేసుకున్న ట్రాన్స్‌జెండర్.. యువతిని ఆశీర్వదించి డబ్బులు ఇవ్వమని అడిగింది. అయితే డబ్బులు ఇవ్వడానికి ఆ యువతి అంగీకరించలేదు.
డబ్బులు ఇవ్వనని సున్నితంగానే చెప్పింది. అక్కడినుంచి కొంచెం ముందుకు వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే టీషర్ట్ వేసుకున్న ట్రాన్స్‌జెండర్.. యువతి ముఖంపై గుట్కా ఉమ్మేసింది. ఈ దృశ్యాలన్నీ సెల్ఫీ వీడియోలో రికార్డు అయ్యాయి. గుట్కా తనపై పడటం గుర్తించిన యువతి ఆగ్రహానికి గురైంది. ట్రాన్స్‌జెండర్లతో గొడవ పెట్టుకుంది. ఈ గొడవ చూసి కొంతమంది యువకులు వారి దగ్గరకు వచ్చారు. యువతి సెల్ఫీ వీడియోలో రికార్డు అయిన దృశ్యాలను యువకులకు చూపించింది. దీంతో ఆ యువకులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ట్రాన్స్‌జెండర్లను నిలదీశారు.
ట్రాన్స్‌జెండర్లు సారీ చెప్పాల్సింది పోయి వీడియో డిలీట్ చేయాలంటూ యువతితో గొడవ పెట్టుకున్నారు. యువకులు వారిని అడ్డుకుని అక్కడి నుంచి పంపించేశారు. ట్రాన్స్‌జెండర్.. యువతిపై గుట్కా ఉమ్మేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు .. ‘ఈ మధ్య కాలంలో ట్రాన్స్‌జెండర్ల అరాచకాలు బాగా పెరిగిపోయాయి. చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు’.. ‘రైళ్లలో మాత్రమే కాదు.. బస్సుల్లోకి కూడా ఎక్కి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
అండర్ 19 ప్రపంచ కప్: భారత్‌తో సెమీ ఫైనల్.. టాస్ నెగ్గిన అఫ్గానిస్తాన్
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత