Home » Cyclone
మొంథా తుపాను ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు మంత్రి నారా లోకేష్.
గ్రామస్థాయి నుంచి అత్యవసర సేవలు అందించటానికి యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. 175 హోర్డింగ్ పాయింట్లు గుర్తించి వాటిని తొలగించడం జరిగిందని చెప్పారు.
మెుంథా తుపాన్ దృష్ట్యా అనకాపల్లి జిల్లాలో కలెక్టర్ విజయ కృష్ణన్ మూడు రోజులు సెలవులు ప్రకటించారు. తుపాన్ ప్రభావం దృష్ట్యా జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలకు అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
మెుంథా తుపాన్ గురించి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. ముందస్తు సమాచారం అందేలా చూడాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. రోడ్లపై చెట్లు కూలితే వెంటనే తొలగించేలా అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు.
ఆంధ్ర తీరం దిశగా 'మొంథా' తుఫాను దూసుకువస్తోంది. బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం, తుఫానుగా మారింది. ఇది మరింతగా బలపడి తీవ్ర తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉంది.
మొంథా తుపానుతో అప్రమత్తంగా ఉండాలని ఏపీ మంత్రి సవిత ఆదేశాలు జారీచేశారు. తుపాను దృష్ట్యా చేపట్టే చర్యలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. వార్డెన్లు, ఏబీసీడబ్ల్యూవోలు 24 గంటలూ హాస్టళ్లలో ఉండాల్సిందేనని ఆజ్ఞాపించారు మంత్రి సవిత.
మొంథా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పాఠశాలలనూ మూసివేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
మొంథా తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల యంత్రాంగం అప్రమత్తవుతోంది. తుఫానును సమర్థంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధమవుతోంది. మొంథా తుఫాను నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టినట్టు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు.
ఏపీకి మొంథా తుపాను ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను.. కోస్తాతో పాటూ రాయలసీమలోని పలు జిల్లాలపై విరుచుకుపడనుంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం.. పడమర దిశగా పయనించి శనివరం ఉదయానికి వాయుగుండంగా బలపడింది.
మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులకి రాష్ట్ర సర్కార్ దిశానిర్దేశం చేసింది.