బయటకు రాకండి.. ప్రజలకు కలెక్టర్ హెచ్చరిక
ABN, Publish Date - Oct 27 , 2025 | 01:41 PM
గ్రామస్థాయి నుంచి అత్యవసర సేవలు అందించటానికి యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. 175 హోర్డింగ్ పాయింట్లు గుర్తించి వాటిని తొలగించడం జరిగిందని చెప్పారు.
ఎన్టీఆర్: మొంథా తుపాన్ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ లక్ష్మీశ సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాన్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామస్థాయి నుంచి అత్యవసర సేవలు అందించటానికి యంత్రాంగం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. 175 హోర్డింగ్ పాయింట్లు గుర్తించి వాటిని తొలగించడం జరిగిందని చెప్పారు. పాత భవనాల్లో నివసించే వారినీ అక్కడ నుంచి తరలిస్తున్నట్లు లక్ష్మీశ వెల్లడించారు. మరోవైపు తుపాన్ కారణంగా సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Modi Hails Kumram Bheem: కుమ్రం భీమ్ పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకం
Male Dolphins Wear Sea Sponge: నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలే..!
Updated at - Oct 27 , 2025 | 03:45 PM