Home » Cyclone
నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ప్రస్తుతానికి చెన్నైకి 420కిలోమీటర్ల, విశాఖపట్నానికి 450 కిలోమీటర్లు, కాకినాడకి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు.
మొంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు క్షేత్రస్థాయిలో సేవలందించేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమైందని ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఏపీవ్యాప్తంగా 12 జిల్లాల్లో తుఫాను ప్రభావం అత్యధికంగా ఉందని చెప్పుకొచ్చారు నాదెండ్ల మనోహర్.
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి మరో మూడు రోజులు అత్యంత భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖా తంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మొంథా తుపానుగా మారిందని అధికారులు తెలిపారు.
మెుంథా తుపాన్ ముంచుకొస్తోంది. దీంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు పలు రైళ్లను రద్దు చేశారు. రద్దయిన రైళ్లలో గోదావరి, ఉదయ్ ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్, విశాఖపట్నం తిరుపతి ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి.
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఈ స్థాయి నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు జారీ చేశారు. గేట్లు, స్యూయిజ్‌లు, సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు.
మొంథా తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులకి దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లాలో 12 మండలాలపై మొంథా తుపాను ప్రభావం ఉంటుందని తెలిసిన క్రమంలో ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని సూచించారు పవన్ కల్యాణ్.
ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాలు, నైట్ షెల్టర్స్‌ను స్వయంగా వెళ్లి పరిశీలించినట్లు విశాఖ మేయర్ చెప్పారు. ఎటువంటి పరిస్థితి ఏర్పడినా ఎదుర్కొనేందుకు జీవీఎంసీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయని.. మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని స్పష్టం చేసింది వాతావరణ కేంద్రం. అన్ని పోర్టుల్లో ఒకటో నెంబర్ హెచ్చరిక కొనసాగుతోందని పేర్కొంది.
ప్రస్తుతానికి చెన్నైకి 520 కి.మీ, కాకినాడకి 570 కి.మీ, విశాఖపట్నానికి 600 కి.మీ దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు (మంగళవారం) ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది.
మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన పలు పునరావాస కేంద్రాలను స్పెషల్ ఆఫీసర్ ఆమ్రపాలి సందర్శించారు. పునరావాస కేంద్రాల్లో అధికారులు చేపట్టిన ఏర్పాట్లను ఆమెకు జాయింట్ కలెక్టర్ నవీన్ వివరించారు.