Flash Flood Warning: ఏపీకి భారీ వర్ష సూచన.. ఫ్లాష్ ఫ్లడ్స్‌కు ఛాన్స్
ABN , Publish Date - Oct 27 , 2025 | 03:18 PM
తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయని.. మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని స్పష్టం చేసింది వాతావరణ కేంద్రం. అన్ని పోర్టుల్లో ఒకటో నెంబర్ హెచ్చరిక కొనసాగుతోందని పేర్కొంది.
విశాఖపట్నం, అక్టోబర్ 27: నైరుతి- ఆగ్నేయ బంగాళాఖాతాలను ఆనుకుని మొంథా తుపాన్ (Cyclone Montha) వేగంగా కదులుతోంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఏపీలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఆరు రాయలసీమ జిల్లాల్లో, మూడు కోస్తా జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది. అలాగే ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, కర్నూల్, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు వెల్లడించింది. తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయని.. మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని స్పష్టం చేసింది. అన్ని పోర్టుల్లో ఒకటో నెంబర్ హెచ్చరిక కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే ఏపీలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను ప్రకటించింది వాతావరణ శాఖ.
రెడ్ అలర్ట్ జిల్లాలు..
విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు..
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు
ఎల్లో అలర్ట్ జిల్లాలు..
కర్నూలు, అనంతపురం, సత్యసాయి
రేపు (మంగళవారం) రెడ్ అలర్ట్ జిల్లాలు..
శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలు.
రేపు ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు..
నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి
రేపు ఎల్లో అలర్ట్ జిల్లాలు..
కర్నూల్, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు
ఇవి కూడా చదవండి..
బస్సు దగ్ధం ఘటన.. డెడ్‌బాడీస్ అప్పగింత పూర్తి
తుఫాన్ ఎఫెక్ట్.. ఈదురుగాలులతో వర్షాలు స్టార్ట్
Read latest AP News And Telugu News