Home » Crime News
ర్యాపిడో.. అంటూ బైకులో ఎక్కించుకున్నాడు. దూరంగా పొదల్లోకి తీసుకెళ్లి మరికొందరు మందబాబులతో కలిసి ఆ భక్తుడిపై దాడిచేసి బంగారు గొలుసు లాక్కెళ్లారు. తిరుపతిలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి అలిపిరి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లా రామేశ్వరంలో తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ప్లస్-2 చదువుతున్న బాలికను ఓ యువకుడు మద్యం మత్తులో దారుణంగా హత్య చేయగా, ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
లిఫ్ట్‌లో ఇరుక్కొని ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన హైదరాబాద్ నగరంలోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హర్షవర్ధన్(5) అనే బాలుడు అపార్ట్మెంట్లో ఉన్న లిప్టులో ఇరుక్కొని ఊపిరాడక మృతిచెందాడు. దీంతో వారి కుటుబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఆమెకు వివాహం జరిగి కేవలం రెండున్నర నెలలో అయినా.. 8 నెలల గర్భం ఉండడంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయం తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాలో జరిగింది. తమకు పెళ్లి జరిగి కేవలం రెండున్నర నెలలే అవుతోందంటూ ఆయన పోలీసులను ఆశ్రయించాడు. స్థానికంగా ఈ విషయం తీవ్ర సంచలనానికి దారితీసింది. వివరాలిలా ఉన్నాయి.
ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన ప్రమీల (45) అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన ముత్యాలు భార్య ప్రమీల అదే గ్రామానికి చెందిన వడ్డే నెట్టికంటికి ఐదేళ్ల కిందట రూ.20వేలు వడ్డీకి అప్పు ఇచ్చింది.
నగరానికి చెందిన బీటెక్ విద్యార్థి చల్లా శ్రవణ్(18) పుట్టిన రోజునాడే ఆత్మహత్య చేసుకున్నాడు. తాము ఉంటున్న అపార్టుమెంట్‌లోని 5వ అంతస్తు నుంచీ దూకి ప్రాణం తీసుకున్నాడు. దీనిపై అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదుచేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
‘రమా.. అప్పుడే నన్ను వదిలి పోతివా..? నాకు పని చేతకాదు. మన బిడ్డను ఎలా సాకాలి? ఎలా బతకాలి?’ అంటూ భార్య మృతదేహంపై పడి దివ్యాంగుడైన భర్త రోదించిన తీరు కంటతడి పెట్టించింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడిన సంఘటన సోమవారం తిమ్మంపేట వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగింది.
హిజ్రాలు నిర్వహించిన ఆందోళనలో అపశ్రుతి చోటుచేసుకుంది. మోనాలిసా అనే హిజ్రాల గ్యాంగ్ లీడర్ తమపై దాడి చేసిందంటూ పలువురు హిజ్రాలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని లైటర్‌తో నిప్పు అంటించుకుంటుండగా ఏడుగురికి గాయాలయ్యాయి.
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు 4తులాల(40 గ్రాముల) బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం తూంకుంటలో సోమవారం పట్టపగలే జరిగింది.
క్యాన్సర్ వల్ల కుమారుడు చనిపోగా ఆ తండ్రి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆపై మద్యానికి బానిసయ్యాడు. ఆఖరికి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువుచాలించాడు. ఈ సంఘటన సంజీవయ్యనగర్‌లో జరిగింది.