భార్యను చంపేందుకు కుట్ర..! రెండు సార్లు ఫెయిలై.. మూడో ప్రయత్నంలో..
ABN , Publish Date - Feb 04 , 2026 | 06:10 PM
వేరే వ్యక్తితో భార్య సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ భర్త దారుణానికి తెగబడ్డాడు. ఒకటి, రెండు సార్లు కాదు.. ఏకంగా మూడు సార్లు ఆమెను చంపేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతడిపై ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఆడిన నాటకం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఉత్తరప్రదేశ్, ఫిబ్రవరి 04: వేరే వ్యక్తితో భార్య సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ భర్త దారుణానికి తెగబడ్డాడు. ఒకటి, రెండు సార్లు కాదు.. ఏకంగా మూడు సార్లు ఆమెను చంపేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతడిపై ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఆడిన నాటకం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఏం జరిగింది?, పూర్తి స్టోరీ ఏంటో.. పోలీసులు తెలిపిన వివరాల్లో తెలుసుకుందాం..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ ప్రాంతంలో హరిశంకర్ అనే వ్యక్తి తన భార్య సంజనాతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని శంకర్ అనుమానించాడు. ఈ క్రమంలో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. తన భార్యను చంపేందుకు వినీత్, అతని సోదరుడు అర్జున్, అలానే రాజ్ అనే మరో వ్యక్తికి రూ.50 వేలు ఇచ్చాడు. జనవరి 26న హరిశంకర్, సంజనా బైక్ పై వెళ్తుండగా.. ముసుగు ధరించి కాల్పులు జరిపారు. ఈక్రమంలో ఆమె నడుముకు బుల్లెట్ తగిలి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో భర్తే అసలు నిందితుడిగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 26 కంటే ముందు కూడా ఈ కిరాయి గ్యాంగ్.. సంజనాను చంపేందుకు రెండు సార్లు ప్రయత్నించింది. అయితే ఆ రెండు సందర్భాల్లో వారు విఫలం కావడంతో మరో మార్గాన్ని ఎంచుకున్నారు. విభోర్ శర్మ అనే కరుడుగట్టిన నేరస్థుడి నుంచి వారు తుపాకీని సేకరించారు. ఆ తరువాత జనవరి 26న హరిశంకర్ దంపతులు బైక్ పై వెళ్తుండగా.. దుండగులు సంజనాపై కాల్పులు జరిపారు. సీసీపుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా.. భర్త హరిశంకర్ అసలై నిందితుడిగా గుర్తించారు. పోలీసులు హరిశంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. షాకింగ్ విషయాలు వెల్లడించాడు. వేరే వ్యక్తితో తన భార్యకు సంబంధం ఉందని, వారిద్దరూ సన్నిహితంగా మాట్లాకుంటున్నారనే అసూయతో సంజనాను చంపాలని అనుకున్నట్లు హరిశంకర్ పోలీసుల విచారణలో వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
ముగ్గురు అమ్మాయిల ఆత్మహత్య.. డైరీలో సంచలన విషయాలు
ప్రియురాలి దారుణం.. ప్రియుడు తన ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడని..