అక్క పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేక..
ABN , Publish Date - Feb 04 , 2026 | 08:21 AM
అక్క పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన నగరంలోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
- యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: అక్క పెళ్లికి చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కూకట్‌పల్లి పీఎస్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాది కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం(Kothagudem)కు చెందిన జితేందర్ యాదవ్(26) ఉద్యోగం నిమిత్తం నగరానికి వచ్చి ఇంద్రాహిల్స్ శంషీగూడ్‌లో స్నేహితునితో కలిసి ఉంటున్నాడు. కొంతకాలం ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేశాడు. తర్వాత ఉద్యోగం మానేసి మాదాపూర్(Madhapur)లో ఓ ఫుడ్‌కోర్డు నడుపుతున్నాడు.
కాగా ఆరు నెలల క్రితం రూ.4 లక్షలు అప్పు చేసి కుటుంబ సభ్యులు తన అక్కకు పెళ్లి చేశారు. అప్పు తీర్చడం ఎలా అని కొన్ని రోజులుగా జితేందర్ మనస్తాపం చెందుతున్నాడు. మంగళవారం తెల్లవారుజామున రూంలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని స్నేహితుడు హేమంత్ నైట్ డ్యూటీ ముగించుకుని వచ్చే సరికి జితేందర్ ఉరేసుకుని కన్పించాడు. ఈ మేరకు జితేందర్ తండ్రి నాగేశ్వరరావు కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా పెరిగిన బంగారం.. మరింత తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
థియేటర్లపై.. సినిమాల దండయాత్ర! తెలుగులోనే డజన్.. ఎలా చూడాల్రా నాయనా
Read Latest Telangana News and National News