Share News

ఒకరిని కాపాడబోయి మరొకరు...

ABN , Publish Date - Feb 04 , 2026 | 09:50 AM

శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కెనాల్‌లో పడి ఇద్దరు యువకులు గల్లంతయిన విషాద సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ముఖుల్‌ అలియాస్‌ సోను, మస్తాన్‌ అనే యువకులు ఎస్సారెస్పీ కెనాల్‌లో పడి గల్లంతయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఒకరిని కాపాడబోయి మరొకరు...

  • ఎస్సారెస్పీ కెనాల్‌లో పడి ఇద్దరు యువకుల గల్లంతు

  • ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో గాలింపు చర్యలు

  • ఇద్దరూ హైదరాబాద్‌ వాసులే..

హనుమకొండ: హనుమకొండ యాదవనగర్‌ సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్‌లో పడి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. కేయూ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన బిడ్ల ముఖుల్‌ అలియాస్‌ సోను (23), మస్తాన్‌(19) నయీంనగర్‌కు చెందిన పండ్ల వ్యాపారి మహ్మ ద్‌ అబ్బు వద్ద రెండేళ్లుగా ఉంటూ.. చింతగట్టు క్యాంపు వద్ద్ద పండ్ల దుకాణంలో పని చేస్తున్నా రు. మంగళవారం ఉద యం ఎస్సారెస్పీ కెనాల్‌ ప్రాంతానికి వచ్చిన వీరు.. పండ్ల వ్యర్థాలు కెనాల్‌ సమీపంలో పడేసి తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యా రు.


అయితే ప్రమాదవశాత్తూ సోను కెనాల్‌లో జారిపడగా, అది గమనించిన మస్తాన్‌.. సోనును కాపాడేందుకు కెనాల్‌లోకి దిగి వెళ్లి తాను కూడా నీటిలో గల్లంతయ్యాడు. వీరితో పాటు వెళ్లిన వాకిడి ర మేష్‌ వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కేయూ పోలీసులు, హనుమకొండ ఏసీపీ నర్సింహరావు ఘటనా స్థలానికి చేరుకొని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. యాదవనగర్‌ కెనాల్‌ నుంచి గీసుగొండ, ఆత్మకూరు వరకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నా ఎలాంటి ఆచూకీ తెలియకపోవడంతో మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


hanu1.2.jfifగల్లంతైన యువకుల కుటుంబ సభ్యులు చేరుకొని ఘటనా స్థలం వద్ద కన్నీటి పర్యంత మవుతున్నారు. మృతదేహాలను త్వరగా వెతికి అప్పగించాలని అధికారులను వేడుకున్నారు. కాగా, సోను స్వస్థలం హైదరాబాద్‌లోని సుల్తాన్‌షా నగర్‌ కాగా, ఆయన తండ్రి అనిల్‌కుమార్‌ పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. ఇక మస్తాన్‌ స్వస్థలం చాంద్రాయణగుట్ట పరిధిలోని హఫీజ్‌బాబా నగర్‌. ఈయన తండ్రి ఉమర్‌ కూడా పండ్ల వ్యాపారిగా జీవనం సాగిస్తున్నాడు.


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా పెరిగిన బంగారం.. మరింత తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

థియేట‌ర్ల‌పై.. సినిమాల దండ‌యాత్ర‌! తెలుగులోనే డ‌జ‌న్‌.. ఎలా చూడాల్రా నాయ‌నా

Read Latest Telangana News and National News

Updated Date - Feb 04 , 2026 | 09:50 AM