Home » Cricket
టీమిండియా కొత్త చీఫ్ సెలెక్టర్ పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. భారత మాజీ స్టార్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఈ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉంటాడా? అని కొంతకాలంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రశ్నకు స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే స్పందించాడు.
ఆసియా క్రీడలు 2026లో పురుషుల క్రికెట్ విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒక్క క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ కూడా జరగకుండానే సెమీఫైనల్ చేరిన జట్లేవో తేలిపోయాయి. ఈ క్రమంలో మలేసియా క్రికెటర్ విరాన్‌దీప్ సింగ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది.
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టులో కుల్‌దీప్ యాదవ్ తప్పక ఉండాలని స్పష్టం చేశాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన బ్యాటింగ్ సక్సెస్ వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయానికే తాను ఎప్పుడూ ప్రాధాన్యమిచ్చానని చెప్పాడు.
క్రికెట్‌లో అప్పుడప్పుడు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇంగ్లండ్-శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డేలోనూ అలాంటి ఆసక్తికర ఘటనే జరిగింది. శ్రీలంక బ్యాటర్ పవన్ రత్నాయకే విషయంలో తొలుత ఔట్.. ఆ తర్వాత నాటౌట్.. చివరకు మళ్లీ ఔట్‌గా తేల్చారు అంపైర్లు.
ఆసియా క్రీడల్లో క్రికెట్ మ్యాచ్‌లకు వరుణుడు అడ్డంకిగా మారుతున్నాడు. పురుషుల విభాగంలో నాలుగు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లూ వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో నేరుగా సెమీఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి.
టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్‌పై కామెంటేటర్ ఆకాష్ చోప్రా సరదాగా సెటైర్లు వేశాడు. ప్రస్తుత సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ స్థానంలో పార్థివ్ పటేల్‌ను నియమించే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో చోప్రా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అర్జున అవార్డు గ్రహీత ఇల్లూరి అజయ్‌కుమార్ రెడ్డి సోమవారం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్‌ను కలిశారు.
ఆసియా క్రీడలు 2026లో భాగంగా నేడు జరగాల్సిన భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ రద్దు అయింది. భారీ వర్షం కారణంగా టాస్ పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.