Home » Cricket news
భారత అమ్మాయిల జట్టు తొలిసారి ప్రపంచ కప్ సాధించి చర్రిత సృష్టించింది. క్రికెట్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని పంచింది. ఈ నేపథ్యంలో భారత మహిళల క్రికెట్ జట్టు మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది.
హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో టీమిండియాకు కెప్టెన్‌గా దినేశ్ కార్తీక్ వ్యవహరించనున్నాడు. నవంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో 12 జట్లు పోటీపడనున్నాయి. ఆరు ఓవర్ల ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీకి డీకే సారథ్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీపై పేసర్ జహనారా ఆలమ్ తీవ్ర ఆరోపణలు చేసింది. జూనియర్లను కొడుతోందని, జట్టులో అంతర్గత రాజకీయాలు జరుగుతున్నాయని విమర్శించింది. అయితే బంగ్లా క్రికెట్ బోర్డు ఈ ఆరోపణలను ఆధారరహితమని ఖండించింది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 గెలుపు సందర్భంగా టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రత్యేక టాటూను వేయించుకుంది. సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించిన జ్ఞాపకంగా ఈ టాటూను తన చేతిపై వేయించుకున్న హర్మన్, అది తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపింది.
47 ఏళ్ల తర్వాత టీమిండియా మహిళలు వన్డే ప్రపంచ కప్‌ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ గెలుపును 1983లో భారత పురుషుల జట్టు ప్రపంచ కప్ విజేతగా నిలిచిన సందర్భంతో పోల్చడం మొదలుపెట్టారు. దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 37వ పుట్టినరోజు నేడు. 27 వేల పరుగులు, 82 సెంచరీలతో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన రన్ మెషీన్ ఇప్పటికీ తన జోరు తగ్గించలేదు.
మహిళల ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన అమన్‌జోత్ తన నానమ్మ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఖండించింది. ఆమె బాగానే ఉన్నారని, అవాస్తవ ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేసింది.
ఆసియా కప్‌లో ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు హారిస్ రవూఫ్‌పై ఐసీసీ రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. సూర్య కుమార్ యాదవ్, బుమ్రా, ఫర్హాన్‌లపై కూడా జరిమానాలు విధించారు.
మహిళా ప్రపంచకప్ విజయం సందర్భంగా టీమిండియా విక్టరీ పరేడ్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా తెలిపారు. ఐసీసీ సమావేశాల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా తొలి సారిగా ఐసీసీ ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్, దిగ్గజ మహిళా మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు.