మున్సీ, లీస్క్ మెరుపులు
ABN , Publish Date - Feb 10 , 2026 | 02:34 AM
జార్జ్ మున్సీ (54 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 84) మెరుపు హాఫ్ సెంచరీ..మైకేల్ లీస్క్ (5 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 22 నాటౌట్, 4/17) ఆల్‌రౌండ్ షోతో టీ20 ప్రపంచ కప్‌లో...
ఇటలీపై స్కాట్లాండ్ గెలుపు
కోల్‌కతా: జార్జ్ మున్సీ (54 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 84) మెరుపు హాఫ్ సెంచరీ..మైకేల్ లీస్క్ (5 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 22 నాటౌట్, 4/17) ఆల్‌రౌండ్ షోతో టీ20 ప్రపంచ కప్‌లో స్కాట్లాండ్ బోణీ కొట్టింది. గ్రూప్ ‘సి’ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడిన స్కాట్లాండ్..సోమవారం 73 పరుగులతో ఇటలీపై విజయం సాధించింది. మొదట స్కాట్లాండ్ 20 ఓవర్లలో 207/4 స్కోరు చేసింది. మున్సీ, మైకేల్ జోన్స్ (37) తొలి వికెట్‌కు 83 బంతుల్లో 126 పరుగులతో స్కాట్లాండ్‌కు అదిరే ఆరంభం ఇచ్చారు. బ్రండన్ మెక్‌ములెన్ (18 బంతుల్లో 4 ఫోర్లతో 41 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్ చేయడంతోపాటు కెప్టెన్ రిచీ బేరింగ్టన్ (15)తో మూడో వికెట్‌కు 48 పరుగులు జత చేశాడు. చివర్లో లీస్క్ ఇటలీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారీ ఛేదనలో..వరల్డ్ కప్ అరంగేట్ర ఇటలీ జట్టు ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. 16.4 ఓవర్లలో 134/9 పరుగులకు పరిమితమై ఓడింది. ఫీల్డింగ్‌లో గాయపడిన ఇటలీ కెప్టెన్ వేన్ మాడ్సన్ బ్యాటింగ్‌కు రాలేదు. మైకేల్ లీస్క్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్-2026: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం..