సఫారీల దూకుడు
ABN , Publish Date - Feb 10 , 2026 | 02:41 AM
టీ20 వరల్డ్‌క్‌పలో దక్షిణాఫ్రికా తమ ఆరంభ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకుంది. కెప్టెన్ మార్‌క్రమ్ (32 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 59) బ్యాటింగ్‌లో చెలరేగగా.. పేసర్ ఎన్‌గిడి (4/31) కెనడాను...
టీ20 వరల్డ్‌కప్
మార్‌క్రమ్ అర్ధసెంచరీ
కెనడాపై ఘనవిజయం
అహ్మదాబాద్: టీ20 వరల్డ్‌క్‌పలో దక్షిణాఫ్రికా తమ ఆరంభ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకుంది. కెప్టెన్ మార్‌క్రమ్ (32 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 59) బ్యాటింగ్‌లో చెలరేగగా.. పేసర్ ఎన్‌గిడి (4/31) కెనడాను కట్టడి చేశాడు. దీంతో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సఫారీలు 57 రన్స్ తేడాతో విజయం సాధించారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లకు 213 పరుగులు చేసింది. మిల్లర్ (39 నాటౌట్), స్టబ్స్ (34 నాటౌట్), రికెల్టన్ (33), డికాక్ (25) సహకరించారు. స్పిన్నర్ అన్ష్ పటేల్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో కెనడా ఏమాత్రం పోటీనివ్వలేదు. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 రన్స్ చేసి ఓడింది. నవ్‌నీత్ (64),హర్ష్ (33) రాణించారు. యాన్సెన్‌కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎన్‌గిడి నిలిచాడు.
ఆరంభం.. ముగింపు అదుర్స్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు ఓపెనర్లు మార్‌క్రమ్, డికాక్ మెరుపు ఆరంభాన్ని అందించారు. అయితే మధ్య ఓవర్లలో స్పిన్నర్ అన్ష్ పటేల్ సఫారీల జోరుకు బ్రేక్ వేసినా.. చివర్లో మిల్లర్-స్టబ్స్ బ్యాట్లు ఝుళిపించారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచే మార్‌క్రమ్ బౌండరీలతో కదం తొక్కగా, డికాక్ సైతం జోరు చూపాడు. దీంతో పవర్‌ప్లేలోనూ స్కోరు 66కి చేరింది. కానీ ఆ వెంటనే డికాక్ వికెట్ కోల్పోగా తొలి వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం రికెల్టన్‌తో కలిసి మార్‌క్రమ్ రన్‌రేట్‌ను తగ్గకుండా చూశాడు. ఈ ధాటికి పదో ఓవర్‌లోనే స్కోరు వంద దాటింది. అటు మార్‌క్రమ్ 28 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఈ దశలో స్పిన్నర్ అన్ష్ పటేల్ తన వరుస రెండు ఓవర్లలో మార్‌క్రమ్, రికెల్టన్, బ్రెవిస్ (6) వికెట్లతో ఝలక్ ఇచ్చాడు. దీంతో క్రీజులో ఉన్న స్టబ్స్, మిల్లర్ ఆచితూచి ఆడాల్సి వచ్చింది. చివరకు 18వ ఓవర్‌లో స్టబ్స్ 4,6తో స్కోరు కాస్త కదిలింది. 20వ ఓవర్‌లో మిల్లర్ 3 సిక్సర్లతో 21 రన్స్ అందించి స్కోరును 200 దాటించాడు. అలాగే ఈ జోడీ ఐదో వికెట్‌కు అజేయంగా 75 పరుగులు సమకూర్చగా.. ఆఖరి 18 బంతుల్లోనే 47 పరుగులు రాబట్టింది.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా: 20 ఓవర్లలో 213/4. (మార్‌క్రమ్ 59, మిల్లర్ 39 నాటౌట్, స్టబ్స్ 34 నాటౌట్, రికెల్టన్ 33, డికాక్ 25; అన్ష్ 3/31)
కెనడా: 20 ఓవర్లలో 156/8 (నవ్‌నీత్ 64, హర్ష్ 33; ఎన్‌గిడి 4/31, యాన్సెన్ 2/30)
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్-2026: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం..