బాస్ ఆల్‌రౌండ్ షో
ABN , Publish Date - Feb 11 , 2026 | 05:05 AM
బాస్ డి లీడ్స్ (72 నాటౌట్, 2/20) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టడంతో.. టీ20 వరల్డ్‌క్‌పలో నెదర్లాండ్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-ఎలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో...
నమీబియాపై నెదర్లాండ్స్ గెలుపు
న్యూఢిల్లీ: బాస్ డి లీడ్స్ (72 నాటౌట్, 2/20) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టడంతో.. టీ20 వరల్డ్‌క్‌పలో నెదర్లాండ్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-ఎలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 7 వికెట్ల తేడాతో నమీబియాపై గెలిచింది. తొలుత నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 156/8 స్కోరు చేసింది. జాన్ నికోల్ (42), జాన్ ఫ్రైలింగ్ (30) టాస్ స్కోరర్లు. లోగన్ వాన్ బీక్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో నెదర్లాండ్స్ 18 ఓవర్లలో 159/3 స్కోరు చేసి గెలిచింది. కొలిన్ ఏకర్‌మన్ (32), మైకేల్ లెవిట్ (28) రాణించారు. ట్రంపెల్‌మన్, నికోల్ చెరో వికెట్ దక్కించుకొన్నారు. ఈ విజయంతో సూపర్-8 అవకాశాలను నెదర్లాండ్స్ సజీవంగా నిలబెట్టుకొంది.
Also Read:
టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట..
టీ20 ప్రపంచకప్2026 వేళ బీసీసీఐ కీలక నిర్ణయం..!