Share News

సుదీప్‌ ట్రిపుల్‌ మిస్‌

ABN , Publish Date - Feb 10 , 2026 | 02:08 AM

వన్‌ డౌన్‌ బ్యాటర్‌ సుదీప్‌ కుమార్‌ ఘరామీ (299) త్రుటిలో త్రిశతకం కోల్పోగా..ఆంధ్రతో రంజీట్రోఫీ క్వార్టర్‌పైనల్లో బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 629 పరుగుల భారీ స్కోరు...

సుదీప్‌ ట్రిపుల్‌ మిస్‌

బెంగాల్‌ 629 ఆలౌట్‌

ఆంధ్రతో రంజీ క్వార్టర్‌ఫైనల్‌

కళ్యాణి (పశ్చిమబెంగాల్‌): వన్‌ డౌన్‌ బ్యాటర్‌ సుదీప్‌ కుమార్‌ ఘరామీ (299) త్రుటిలో త్రిశతకం కోల్పోగా..ఆంధ్రతో రంజీట్రోఫీ క్వార్టర్‌పైనల్లో బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 629 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లో 64/3 స్కోరు చేసింది. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 295 రన్స్‌ చేసింది. కిందటి రోజు 216 పరుగులతో ఆడుతున్న సుదీప్‌ 299 స్కోరు వద్ద రషీద్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఇక..మరో క్వార్టర్‌ఫైనల్లో కర్ణాటక నాలుగు వికెట్లతో ముంబైకి షాకిచ్చింది. ఇంకో క్వార్టర్స్‌లో జమ్మూ కశ్మీర్‌ 56 పరుగులతో మధ్యప్రదేశ్‌ని ఓడించింది.

చరిత్ర పుటల్లో..: మూడు రోజులు..930 నిమిషాలు ఓపిగ్గా క్రీజులో నిలిచిన సుదీప్‌ కుమార్‌ 596 బంతులు ఎదుర్కొని 31 ఫోర్లు, 6 సిక్స్‌లతో 299 రన్స్‌ చేశాడు. ఈ క్రమంలో పలు రికార్డులను అతడు తిరగ రాశాడు. ట్రిపుల్‌ సెంచరీకి ఒక పరుగు దూరంలో నిష్క్రమించిన తొలి భారత బ్యాటర్‌గా, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఓవరాల్‌గా మూడో ఆటగాడిగా ఖ్యాతి గాంచాడు.

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్-2026: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం..

భారత్‌లో మరో సరికొత్త లీగ్..

Updated Date - Feb 10 , 2026 | 02:08 AM