Share News

భారత్‌తో మ్యాచ్‌కు గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - Feb 10 , 2026 | 02:45 AM

టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ నిర్వహణపై వారం రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. షెడ్యూల్‌ ప్రకారమే భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరుగనుంది. ‘ఈనెల 15న భారత్‌తో...

భారత్‌తో మ్యాచ్‌కు గ్రీన్‌సిగ్నల్‌

నేటి మ్యాచ్‌లు

నెదర్లాండ్స్‌ X నమీబియా

(ఉ. 11 గం. నుంచి)

న్యూజిలాండ్‌ X యూఏఈ (మ.3 గం.)

పాకిస్థాన్‌ X అమెరికా (రా.7 గం.)

  • పాక్‌ ప్రధాని షరీఫ్‌ అనుమతి

  • ఈనెల 15న యథావిధిగా మ్యాచ్‌

లాహోర్‌: టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ నిర్వహణపై వారం రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. షెడ్యూల్‌ ప్రకారమే భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరుగనుంది. ‘ఈనెల 15న భారత్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండాలని పాకిస్థాన్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ మా జట్టుకు సూచించారు’ అని పీసీబీ అధికార ప్రతినిధి ఆమిర్‌ మీర్‌ తెలిపారు. దీంతో కొలంబోలో జరగాల్సిన ఈ మ్యాచ్‌కు అడ్డంకులన్నీ తొలగినట్టయింది. అలాగే శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకేకు కూడా షరీఫ్‌ స్వయంగా ఈ విషయాన్ని తెలిపినట్టు సమాచారం.

ఫలించిన చర్చలు: మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ జట్టుకు ఉద్వాసన పలకడంతో పాక్‌ క్రికెట్‌ బోర్డు వారికి మద్దతుగా నిలిచింది. దీనిలో భాగంగా ఈనెల 15న కొలంబోలో జరిగే మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేస్తున్నట్టు ప్రకటించడంతో క్రికెట్‌ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. ఈ మ్యాచ్‌ ద్వారా వేల కోట్ల ఆదాయాన్ని ఆశిస్తున్న ఐసీసీతో పాటు బ్రాడ్‌కాస్టర్‌ జియోస్టార్‌ కూడా ఈ నిర్ణయం కలవరపాటుకు గురి చేసింది. అటు స్టార్‌ న్యాయపరమైన చర్యలకు దిగుతానంటూ హెచ్చరించింది. అలాగే శ్రీలంక క్రికెట్‌ బోర్డు కూడా బాయ్‌కాట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా పాక్‌ బోర్డుకు విజ్ఞప్తి చేసింది. గతంలో పాక్‌ దేశంలో ఏ విదేశీ జట్టూ పర్యటించని పరిస్థితుల్లో తమ బృందాన్ని పంపిన విషయాన్ని గుర్తు చేసింది. అలాగే భారత్‌తో మ్యాచ్‌ ఆడకుంటే తాము కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. దీనికితోడు ఆదివారం ఐసీసీ వైస్‌ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖవాజా, బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు అమీనుల్‌ ఇస్లాం కలిసి పీసీబీ చీఫ్‌ మొహిసిన్‌ నఖ్వీతో సమావేశమయ్యారు. ఇందులో బాయ్‌కాట్‌ నిర్ణయంపై మనసు మార్చుకోవాలంటూ నఖ్వీని అమీనుల్‌ ఇస్లాం ప్రత్యేకంగా కోరారు. '


‘భారత్‌తో మ్యాచ్‌ ఆడే విషయమై బంగ్లా, శ్రీలంక, యూఏఈ బోర్డులతో పాటు ఐసీసీ నుంచి కూడా ఒత్తిడి రావడంతో ప్రధాని షహబాజ్‌ షరీ్‌ఫతో నఖ్వీ మాట్లాడనున్నారు. ఏదిఏమైనా తుది నిర్ణయం ప్రధాని తీసుకుంటారు’ అని పీసీబీ వర్గాలు వెల్లడించాయి. అన్నట్టుగానే సోమవారం అర్ధరాత్రి ప్రధాని నుంచి సానుకూల ప్రకటన రావడంతో టీ20 వరల్డ్‌క్‌పనకు సరికొత్త ఉత్సాహాన్నిచ్చినట్టయ్యింది. మరోవైపు భారత్‌లో జరిగే టీ20 వరల్డ్‌క్‌పనకు దూరంగా ఉన్నందుకు బంగ్లాదేశ్‌ బోర్డుపై ఎలాంటి ఆంక్షలు విధించడం లేదని ఐసీసీ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్-2026: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం..

భారత్‌లో మరో సరికొత్త లీగ్..

Updated Date - Feb 10 , 2026 | 02:45 AM