చెలరేగిన పేస్ త్రయం
ABN , Publish Date - Feb 10 , 2026 | 02:38 AM
బ్రియాన్ బెన్నెట్ (48 నాటౌట్) తోపాటు పేస్ త్రయం బ్లెస్సింగ్ ముజరబాని (3/16), రిచర్డ్ ఎన్‌గరవ (3/17), బ్రాడ్ ఇవాన్స్ (3/18) చెలరేగడంతో.. టీ20 వరల్డ్‌క్‌పలో జింబాబ్వే ఘనంగా...
జింబాబ్వే బోణీ
8 వికెట్లతో ఒమన్ చిత్తు
కొలంబో: బ్రియాన్ బెన్నెట్ (48 నాటౌట్) తోపాటు పేస్ త్రయం బ్లెస్సింగ్ ముజరబాని (3/16), రిచర్డ్ ఎన్‌గరవ (3/17), బ్రాడ్ ఇవాన్స్ (3/18) చెలరేగడంతో.. టీ20 వరల్డ్‌క్‌పలో జింబాబ్వే ఘనంగా బోణీ చేసింది. గ్రూప్-బిలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో ఒమన్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ 19.5 ఓవర్లలో 103 పరుగులకు కుప్పకూలింది. సూఫియాన్ మెహమూద్ రెండు వికెట్లు పడగొట్టాడు. జింబాబ్వే బౌలర్ల దెబ్బకు ఒక దశలో ఒమన్ 27/5తో టోర్నీలో అత్యల్పస్కోరు నమోదు చేసేలా కనిపించింది. కానీ, మిడిలార్డర్‌లో వినయ్ శుక్లా (28), సూఫియాన్ (25) ఆదుకోవడంతో టీమ్ స్కోరు కష్టంగా సెంచరీ మార్క్ దాటగలిగింది. అనంతరం ఛేదనలో జింబాబ్వే 13.3 ఓవర్లలో 106/2 స్కోరు చేసి గెలిచింది. బెన్నెట్, బ్రెండన్ టేలర్ (31 రిటైర్డ్ హర్ట్) మూడో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో.. జింబాబ్వే మరో 39 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకొంది. ముజరబాని ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్-2026: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం..