Home » Cricket news
అనుకున్నట్టుగానే టీమిండియా ఆసియా కప్‌లో తన ప్రతాపం చూపించింది. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ ఆధిపత్యం ప్రదర్శించి సత్తా చాటింది. యూఏఈ నిర్దేశించిన లక్ష్యాన్ని ఐదు ఓవర్ల లోపే ఛేదించింది.
పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా కచ్చితంగా దూకుడుగా ఉంటుందని కెప్టెన్ సూర్యకుమార్ తెలిపాడు. ఆసియా కప్ టోర్నీ మొదలుపెట్టేందుకు ఉత్సుకతతో ఉన్నానని మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్ లోపలికి వెళుతూ రోహిత్ కెమెరాలకు చిక్కాడు. హాస్పిటల్ లోపలికి వెళుతున్న రోహిత్‌ను బయట ఉన్న వారు ప్రశ్నలు అడిగారు.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరో సరికొత్త అవతారంలో అభిమానులకు కనువిందు చేయబోతున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన ధోనీ ఐపీఎల్ మాత్రం ఆడుతున్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్లో ధోనీ, ఆడతాడా లేదా అనే సందిగ్ధంలో ఉన్న అభిమానులకు తాజాగా అదిరిపోయే షాకిచ్చాడు.
దుబాయ్ వేదికగా ఆసియా కప్-2025 మరో రెండ్రోజుల్లో ప్రారంభం కాబోతోంది. పూర్తిగా టీ-20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో ఆసియా ఖండానికి సంబంధించిన జట్లు పాల్గొనబోతున్నాయి. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే దుబాయ్‌లో ల్యాండ్ అయ్యి ప్రాక్టీస్ ప్రారంభించింది.
మరో రెండ్రోజుల్లో దుబాయ్ వేదికగా ఆసియా కప్-2025 ప్రారంభం కాబోతోంది. పూర్తిగా టీ-20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో ఆసియా ఖండానికి సంబంధించిన జట్లు పాల్గొనబోతున్నాయి. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే దుబాయ్‌లో ల్యాండ్ అయ్యి ప్రాక్టీస్ ప్రారంభించింది.
పాక్‌తో మల్టీనేషనల్ టోర్నమెంట్లల్లో పాల్గొనవద్దని కేంద్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదని బీసీసీఐ సెక్రెటరీ దేవ్జిత్ సైకియా తాజాగా స్పష్టం చేశారు. స్నేహపూర్వక సంబంధాలు లేని దేశాలతో ద్వైపాక్షిక టోర్నీల్లోనే భారత్ పాల్గొనబోదని వివరించారు.
టీమిండియా దిగ్గజ ఆటగాడు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా ముంబైలోని వర్లీలో సందడి చేశాడు. గణపతి పూజల కోసం ఓ మండపానికి వెళ్లిన రోహిత్‌ను అతడి అభిమానులు చుట్టుముట్టారు. రోహిత్ కారును కదలనివ్వలేదు. దీంతో రోహిత్ కారు సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశాడు.
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన క్రికెటర్లు, సెలబ్రిటీలు చిక్కులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బెట్టింగ్ వ్యవహారం దుమారం రేపుతోంది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నారు. వీరిద్దరూ ఇప్పటికే టీ-20, టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరు ఇకపై టీమిండియా తరఫున వన్డేలు మాత్రమే ఆడబోతున్నారు.