Pappu Yadav Son IPL: ఐపీఎల్2026లోకి ఎంపీ కొడుకు.. ధర ఎంతంటే..
ABN , Publish Date - Dec 17 , 2025 | 04:03 PM
ఐపీఎల్2026 మినీ వేలం పలువురు ప్లేయర్లకు కాసుల పంట పండించింది. ఈ వేలంతో ఓ ఎంపీ కొడుకు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ వేలంలో భారత అన్‌క్యాప్డ్ ప్లేయర్ల కోసం కూడా కోల్‌కతా జట్టు తమ పర్స్‌లో ఉన్న మొత్తాన్ని వెచ్చింది. ఆ జట్టు కొనుగోలు చేసిన మొత్తం 13 మంది ఆటగాళ్లలో స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ కుమారుడు సార్థక్ రంజన్ కూడా ఉన్నాడు.
అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్(IPL 2026 mini auction)మినీ వేలంలో అందరీని ఆశ్చర్యానికి గురి చేసే కొన్ని సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR auction news) భారీ బిడ్డింగ్స్‌తో ఆశ్చర్యపరిచింది. రూ. 64.30 కోట్ల భారీ పర్సుతో వేలంలోకి దిగిన కేకేఆర్.. మొత్తం 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అలానే చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఇద్దరు అన్ క్యాప్డ్ ప్లేయర్లను చెరో రూ.14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. మొత్తంగా ఐపీఎల్2026 మినీ వేలం పలువురు ప్లేయర్లకు కాసుల పంట పండించింది. ఈ వేలంతో ఓ ఎంపీ కొడుకు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మరి.. అతడు ఎవరు, ఎంత ధర పలికాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్ 2026 మినీ వేలంలో కేకేఆర్ ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్(Cameron Green )ను ఏకంగా రూ. 25.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి సంచలనం సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ రికార్డు సృష్టించాడు. అదేవిధంగా భారత అన్‌క్యాప్డ్ ప్లేయర్ల కోసం కూడా కోల్‌కతా జట్టు తమ పర్స్‌లో ఉన్న మొత్తాన్ని వెచ్చింది. ఆ జట్టు కొనుగోలు చేసిన మొత్తం 13 మంది ఆటగాళ్లలో స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ కుమారుడు సార్థక్ రంజన్ కూడా ఉన్నాడు.
29 ఏళ్ల సార్థక్ ను రూ. 30 లక్షల కనీస ధరకు కోల్‌కతా కొనుగోలు చేసింది. అతడు ఐపీఎల్‌కు ఎంపిక కావడం ఇదే తొలిసారి. ఇతడు దేశవాళీ క్రికెట్ లో ఢిల్లీ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక తన కుమారుడు ఐపీఎల్‌కు ఎంపిక కావడం పట్ల పప్పు యాదవ్(Pappu Yadav son IPL) ఆనందం వ్యక్తం చేశాడు.పప్పు యాదవ్ బీహార్‌లోని పూర్ణియా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందాడు. ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇవి కూడా చదవండి:
Ashes 2026:నల్ల బ్యాడ్జీలతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెటర్లు.. కారణం ఇదే..!
అతడితో కలిసి ఆడేందుకు ఎదురుచూస్తున్నా.. రవి బిష్ణోయ్