The Ashes: అలెక్స్ కెరీ సెంచరీ.. తొలి రోజు ముగిసిన ఆట
ABN , Publish Date - Dec 17 , 2025 | 01:27 PM
ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సరికి ఆసీస్.. 8 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా మూడో టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ తలపడుతున్నాయి. ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌లో ఇప్పటికే రెండు గెలిచిన ఆసీస్ 2-0తో ముందంజలో ఉంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసేసరికి 83 ఓవర్లు ఆడి 8 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కెరీ(106) అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు. స్టీవ్ స్మిత్ అనారోగ్యానికి గుర్వడంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఉస్మాన్ ఖవాజా(82) సూపర్ నాక్ ఆడాడు. అందివచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు.
జోస్ ఇంగ్లిస్(32) పర్వాలేదనిపించాడు. ట్రావిస్ హెడ్(10), జేక్ వెదర్లాడ్(18), లుబుషేన్(19), కామెరూన్ గ్రీన్(0), పాట్ కమిన్స్(13) తీవ్రంగా నిరాశపర్చారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి మిచెల్ స్టార్క్ 13*, నాథన్ లైయన్ 0* పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3, బ్రైడన్ కార్స్, విల్ జాక్స్ తలో రెండు, జోష్ టంగ్ ఒక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ వేలంలో ‘జాక్‌పాట్’.. యాషెస్‌లో ‘డకౌట్’!
అతడితో కలిసి ఆడేందుకు ఎదురుచూస్తున్నా.. రవి బిష్ణోయ్