Cameron Green: ఐపీఎల్ వేలంలో ‘జాక్‌పాట్’.. యాషెస్‌లో ‘డకౌట్’!
ABN , Publish Date - Dec 17 , 2025 | 11:23 AM
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ప్లేయర్ కామెరూన్ గ్రీన్‌ను రూ.25.20కోట్లకు కేకేఆర్ తీసుకున్న విషయం తెలిసిందే. కాగా యాషెస్ సిరీస్‌లో గ్రీన్ డకౌట్ అయ్యాడు. కేకేఆర్‌కు ఎలా ఆడతాడో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ కామెరూన్ గ్రీన్‌కు మంగళవారం జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో కోట్లాభిషేకం జరిగింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన మూడో క్రికెటర్‌గా గ్రీన్(Cameron Green) నిలిచాడు. అతడిని రూ.25.20కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే యాషెస్ సిరీస్‌లో గ్రీన్ డకౌట్ అయ్యాడు. అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు బంతులు ఎదుర్కొని జోఫ్రా అర్చర్ బౌలింగ్‌లో బ్రైడన్ కార్స్‌కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 65.3 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా(82) అద్భుత హాఫ్ సెంచరీ చేశాడు. ట్రావిస్ హెడ్(10), జేక్ వెదరాల్డ్(18), లుబుషేన్(19), ప్యాట్ కమిన్స్(13), కామెరూన్ గ్రీన్(0) తీవ్రంగా విఫలమయ్యారు. క్రీజులో అలెక్స్ క్యారీ 85*, జోష్ ఇంగ్లిష్ 32* ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3, బ్రైడన్ కార్స్, విల్‌జాక్స్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ యాషెస్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టు 2-0తో ముందంజలో ఉంది.
ఆనందంగా ఉంది..
ఐపీఎల్ వేలం తర్వాత గ్రీన్ తన ఆనందాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. ‘ఈ సంవత్సరం కోల్‌కతాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఈడెన్ గార్డెన్స్‌లో బరిలోకి దిగేందుకు, అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇది మాకు మంచి సంవత్సరం కావాలని ఆశిస్తున్నా’ అని కామెరూన్ గ్రీన్ ఓ వీడియోలో అన్నాడు. దాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ ‘ఎక్స్’ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది.
ఇవి కూడా చదవండి:
ధోనీ భాయ్‌కి రుణపడి ఉంటా.. పతిరన ఎమోషనల్ పోస్ట్
ధోనికి ఇదే చివరి ఐపీఎల్.. రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు