Share News

Cameroon Green: ఐపీఎల్ వేలంలో రూ.25 కోట్లు.. యాషెస్‌లో డకౌట్

ABN , Publish Date - Dec 17 , 2025 | 02:43 PM

ఐపీఎల్‌ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ భారీ ధర పలికి వార్తల్లో నిలిచాడు. అతన్ని రూ.25.20 కోట్లకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సొంతం చేసుకుంది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే యాషెస్‌ సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌ అతడు డకౌట్‌ అయ్యాడు.

Cameroon Green: ఐపీఎల్ వేలంలో రూ.25 కోట్లు.. యాషెస్‌లో డకౌట్
Cameroon Green

ఇంటర్నెట్ డెస్క్: అబుదాబీ వేదికగా నిన్న(మంగళవారం) ఐపీఎల్ 2026 మినీ వేలం(IPL auction) జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్(Cameroon Green) భారీ ధర పలికాడు. రూ.25.20 కోట్లకు కేకేఆర్ జట్టు సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్ గా గ్రీన్ రికార్డు సృష్టించాడు. అతడి ప్రదర్శనపై అందరూ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే వేలం ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే తన పేలవ ప్రదర్శనతో క్రికెట్ ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు. రూ.25.20కోట్ల ధర పలికిన కామెరూన్.. యాషెస్ లో డకౌట్ అయ్యాడు.


ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌(Ashes 2026)లో భాగంగా బుధవారం(డిసెంబర్ 17)ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా(England vs Australia) మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కామెరూన్ గ్రీన్ తన పరుగుల ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. 2 బంతులు ఎదుర్కొని జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో బ్రైడన్ కార్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 326 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో అలెక్స్ క్యారీ(106) సూప‌ర్ సెంచ‌రీతో చెల‌రేగ‌గా.. ఉస్మాన్‌ ఖవాజా(126 బంతుల్లో 82), ఇంగ్లిష్‌(32) రాణించారు. ప్రస్తుతం క్రీజులో మిచెల్ స్టార్క్‌(33), లియోన్‌(0) ఉన్నారు.


ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టగా.. విల్ జాక్స్, బ్రైడన్ కార్స్ తలా రెండు వికెట్లు సాధించారు. ఐపీఎల్ 2026 వేల లో భారీ ధర పలికిన గ్రీన్..డకౌట్ కావడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఐపీఎల్‌లో కూడా ఇలానే ఆడుతావా? కోల్‌కతా(KKR) జట్టు భయపడుతోంది అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. గాయం కారణంగా గత ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉన్న గ్రీన్‌.. ఈసారి కేకేఆర్ తరపున బరిలోకి దిగనున్నాడు. అయితే కామెరూన్(Cameroon Green) తనదైన రోజున ఒంటి చేత్తో జట్టును గెలిపించగలడు.



ఇవి కూడా చదవండి:

ధోనీ భాయ్‌కి రుణపడి ఉంటా.. పతిరన ఎమోషనల్ పోస్ట్

ధోనికి ఇదే చివరి ఐపీఎల్.. రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Dec 17 , 2025 | 03:18 PM