Share News

South Africa vs India 5th T20: చెలరేగిన తిలక్, హార్దిక్.. దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్..

ABN , Publish Date - Dec 19 , 2025 | 09:04 PM

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న చివరి మ్యాచ్‌లో తిలక్ వర్మ (73), హార్దిక్ పాండ్యా (63) అర్ధశతకాలు సాధించి టీమిండియాకు భారీ స్కోరు అందించారు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 231 పరుగులు సాధించింది. దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం ఉంచింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే టీమిండియా 2-1తో లీడింగ్‌లో ఉంది.

South Africa vs India 5th T20: చెలరేగిన తిలక్, హార్దిక్.. దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్..
ndia vs South Africa live score

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు విజృంభించారు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న చివరి మ్యాచ్‌లో తిలక్ వర్మ (73), హార్దిక్ పాండ్యా (63) అర్ధశతకాలు సాధించి టీమిండియాకు భారీ స్కోరు అందించారు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 231 పరుగులు సాధించింది. దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం ఉంచింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే టీమిండియా 2-1తో లీడింగ్‌లో ఉంది (IND vs SA T20 match).


టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు భారత బ్యాటర్లు షాకిచ్చారు. ఓపెనర్లు సంజూ శాంసన్ (37), అభిషేక్ శర్మ (34) తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) మరోసారి త్వరగానే ఔటైనా వన్‌డౌన్‌లో వచ్చిన తిలక్ వర్మ (42 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్‌తో 73) వేగంగా ఆడాడు. ఆ తర్వాత హార్ధిక్ పాండ్యా (25 బంతుల్లో 5 సిక్స్‌లు, 5 ఫోర్లతో 63) బౌండరీలతో హోరెత్తించాడు. వీరి అండతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 231 పరుగులు సాధించింది (SA need 232 runs).


దక్షిణాఫ్రికా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు (India vs South Africa live score). చివరి ఓవర్లో బాష్ రెండు వికెట్లు తీశాడు. బ్రాట్‌మన్, లిండే ఒక్కో వికెట్ పడగొట్టారు. ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే టీమిండియా 2-1తో లీడింగ్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిస్తేనే సిరీస్‌ను సమం చేయగలుగుతుంది. అహ్మదాబాద్‌లో మంచు కురుస్తున్న నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం మరింత సులభమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ భారీ స్కోరును టీమిండియా ఎలా కాపాడుకుంటుందో చూడాలి.


ఇవీ చదవండి:

చిరస్మరణీయం.. ఎన్నేళ్లో వేచిన ఉదయం.. ఆ రోజు నిజమైంది!

జట్టుకు ఇది సరిపోదు.. గిల్ ఫామ్‌పై మాజీ బ్యాటింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Dec 19 , 2025 | 09:04 PM