Shubman Gill: జట్టుకు ఇది సరిపోదు.. గిల్ ఫామ్‌పై మాజీ బ్యాటింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:00 PM
టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గత కొంత కాలంగా పేలవ ప్రదర్శనలు కనబరుస్తున్నాడు. అతడి ఫామ్‌పై టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ మాట్లాడాడు. ఇంకాస్త ఫుట్‌వర్క్ చేయాలని గిల్‌కు సూచించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా టీ20 జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గత కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. గత 15 ఇన్నింగ్స్‌ల్లో గిల్ 137.3 స్ట్రైక్ రేట్‌తో 291 పరుగులు మాత్రమే చేశాడు. వైట్ బాల్ క్రికెట్‌లోనూ గత 21 ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఒక్క అర్థ శతకం కూడా నమోదు చేయలేదు. గిల్ ఫామ్‌పై టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ మాట్లాడాడు.
‘ప్రారంభంలో గిల్(Shubman Gill) ఫుట్ వర్క్ బాగుంది. కానీ గత 28 మ్యాచుల్లో బౌండరీలు బాదిన బంతులను వదిలేస్తే.. మిగతా బాల్స్ ఆడేటప్పుడు ముఖ్యంగా నేరుగా వచ్చే బంతుల విషయంలో గిల్ ఫుట్ వర్క్ సరిగ్గా లేదు. అతడి స్ట్రైక్ రేట్ కూడా బాగా పడిపోయింది. ఆఫ్ స్టంప్‌కు అవుట్ సైడ్ బంతులను ఆడే విషయంలో గిల్ స్ట్రైక్ రేట్ బానే ఉంది. ఓవరాల్‌గా కొన్ని పరుగులైతే చేశాడు. కానీ జట్టుకు ఇది సరిపోదు. గిల్ ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. టీమిండియా-సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20లో అతడు అద్భుతమైన బంతికి ఔటయ్యాడు. నిజానికి ఆ బాల్‌కు ఏ బ్యాటరైనా వెనుదిరగాల్సిందే. అతడు తన ఫుట్‌వర్క్‌ను మెరుగుపరుచుకుంటే పరుగులు సాధించగలడు. అతడు కొట్టిన మూడు, నాలుగు బౌండరీలు అలా వచ్చినవే’ అని సంజయ్ అన్నాడు.
వారిద్దరూ అలా..
‘అభిషేక్ శర్మ మైండ్ సెట్ కీ ఫ్యాక్టర్. కవర్స్ మీదుగా అభిషేక్ బంతులను తరలించగలడు. ఇది అతడికున్న ప్రత్యేక నైపుణ్యం. పాండ్య బహుముఖ ప్రజ్ఞ భారత జట్టుకు చక్కటి బ్యాలెన్స్‌ను అందిస్తోంది’ అని సంజయ్ బంగర్ విశ్లేషించాడు.
నేడు టీమిండియా-సౌతాఫ్రికా అహ్మదాబాద్ వేదికగా ఐదో టీ20లో తలపడనున్నాయి. లఖ్‌నవూలో జరగాల్సిన నాలుగో టీ20 పొగమంచు కారణంగా రద్దు అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమ్‌ఇండియా ఈ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉంది. అయిదో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత జట్టు చూస్తోంది. అలాగే అహ్మదాబాద్ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేసి ఘనంగా తన పర్యటనను ముగించాలని సఫారీల జట్టు ఆశిస్తోంది.
ఇవీ చదవండి:
రోల్ బాల్ ప్రపంచ కప్ విజేతగా భారత్
మెస్సి కోల్‌కతా పర్యటన.. కోర్టును ఆశ్రయించిన గంగూలీ!