Share News

The Ashes: చేతులెత్తేసిన ఇంగ్లండ్.. భారీ ఆధిక్యం దిశగా ఆసీస్

ABN , Publish Date - Dec 19 , 2025 | 11:24 AM

యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మూడో టెస్టులో తలపడుతున్నాయి. ఓవర్‌నైట్ 213/8 స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ 286 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది.

The Ashes: చేతులెత్తేసిన ఇంగ్లండ్.. భారీ ఆధిక్యం దిశగా ఆసీస్
The Ashes

ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మూడో టెస్టు ఆడుతున్నాయి. ఇప్పటికే రెండు టెస్టు మ్యాచులు గెలిచిన కంగారూ జట్టు 2-0తో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. మూడో టెస్టులో కూడా అదే దూకుడు కొనసాగిస్తూ అద్భుత ప్రదర్శన చేస్తూ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. 46 ఓవర్లకు 4 నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది.


213/8 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ 286 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్(83), జోఫ్రా ఆర్చర్(51) హాఫ్ సెంచరీలు చేయడంతో ఇంగ్లండ్‌ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. డకెట్(29), బ్రూక్(45), జెమీ స్మిత్(22) పర్వాలేదనిపించారు. క్రాలీ(9), ఓలీ పోప్(3), రూట్(19), విల్ జాక్స్(6), టంగ్(7), బ్రైడన్(0) ఘోరంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లు కమిన్స్, బోలాండ్ చెరో మూడు, లైయన్ 2, స్టార్క్, గ్రీన్ తలో ఒకటి వికెట్లు పడగొట్టారు.


రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ట్రావిస్ హెడ్(96*) సెంచరీ దిశగా సాగుతున్నాడు. మరో ఎండ్‌లో అలెక్స్ కెరీ(25*) బ్యాటింగ్ చేస్తున్నాడు. ఉస్మాన్ ఖవాజా(40) రాణించాడు. వెదర్‌లాండ్(1), లుబుషేన్(13), గ్రీన్(7) నిరాశపర్చాడు. ఇంగ్లండ్ బౌలర్లలో టంగ్ 2, బ్రైడన్, విల్ జాక్స్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం ఆసీస్ 284 పరుగుల ఆధిక్యంలో ఉంది.


ఇవీ చదవండి:

రోల్ బాల్ ప్రపంచ కప్ విజేతగా భారత్

మెస్సి కోల్‌కతా పర్యటన.. కోర్టును ఆశ్రయించిన గంగూలీ!

Updated Date - Dec 19 , 2025 | 11:24 AM