Kapil Dev: గంభీర్ కోచ్ కాదు... కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 19 , 2025 | 08:07 AM
క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్.. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ అసలు కోచ్ కాదని.. జట్టుకు మేనేజర్ మాత్రమే అని అన్నాడు. కాగా కపిల్ దేవ్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: గౌతమ్ గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విమర్శలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచినప్పటికీ.. స్వదేశంలోనే టెస్టుల్లో గతేడాది న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్, ఈ ఏడాది సౌతాఫ్రికాపై క్లీన్‌స్వీప్ అయింది. జట్టుపై గంభీర్ చేస్తున్న ప్రయోగాలు, తీసుకుంటున్న నిర్ణయాలే వల్లే టీమిండియా ఓటమి పాలవుతుందని అభిమానుల నుంచి క్రికెట్ మాజీల వరకు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(Kapil Dev) గంభీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘ఆధునిక క్రికెట్‌లో ‘కోచ్’ అనే పదాన్ని తప్పుగా వాడుతున్నారు. గంభీర్(Gautam Gambhir) కోచ్ కాదు.. జట్టుకు మేనేజర్ మాత్రమే. పాఠశాల, కళాశాలల్లో ఆటలను నేర్పేవాడు మాత్రమే కోచ్. కోచ్ అనే పేరు ఇచ్చినంత మాత్రాన ఆ పాత్రను ఎవరూ పోషించలేరు. ఎందుకంటే ఒక లెగ్ స్పిన్నర్ లేదా వికెట్‌కీపర్‌కు గంభీర్ ఎలా కోచ్ అవుతాడు? ఆటగాళ్లను చూసుకోవడం వరకే ప్రస్తుత కోచ్ పని. ప్లేయర్లకు ప్రోత్సాహాం అందించాలి. స్ఫూర్తి రగిలించాలి. ఆటగాళ్లు జట్టులో సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. ఇవి కోచ్ విధులు’ అని కపిల్ దేవ్ అన్నాడు.
మరోవైపు శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికా-ఇండియా మధ్య ఐదో టీ20 జరగనుంది. ఈ సిరీస్‌లో టీమిండియా 2-1తో ముందంజలో ఉంది. కాగా లఖ్‌నవూలో జరగాల్సిన నాలుగో టీ20.. మంచు ప్రభావం కారణంగా రద్దు అయిన విషయం తెలిసిందే. మరి టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను దక్కించుకుంటారా? ఓడి సమం చేస్తారా? అనేది చూడాల్సి ఉంది. టీ20 ప్రపంచ కప్ 2026 దగ్గర పడుతున్న సమయంలో ఈ విజయం.. ఆటగాళ్లకే మాత్రం కాదు కోచ్ గంభీర్‌కు కూడా అవసరమే!
ఇవీ చదవండి:
Sarfaraz Khan: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్
Ashes DRS Controversy: యాషెస్ సిరీస్‌లో స్నికో మీటర్ వివాదం.. స్పందించిన ఐసీసీ