Share News

Ashes DRS Controversy: యాషెస్ సిరీస్‌లో స్నికో మీటర్‌ వివాదం.. స్పందించిన ఐసీసీ

ABN , Publish Date - Dec 18 , 2025 | 03:54 PM

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆటలో డిసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) వివాదం చోటుచేసుకుంది. దీనిపై ఐసీసీ స్పందించింది. అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీకి సంబంధించిన డీఆర్ఎస్ విషయంలో సాంకేతిక లోపం జరిగిందని ఐసీసీ అంగీకరించింది.

Ashes DRS Controversy: యాషెస్ సిరీస్‌లో స్నికో మీటర్‌ వివాదం.. స్పందించిన ఐసీసీ
Ashes DRS controversy

ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆటలో డిసిషన్ రివ్యూ సిస్టమ్(డీఆర్ఎస్) వివాదం(Ashes DRS controversy) చోటుచేసుకుంది. దీనిపై ఐసీసీ స్పందించింది. అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ అలెక్స్ కేరీకి సంబంధించిన డీఆర్ఎస్ విషయంలో సాంకేతిక లోపం జరిగిందని ఐసీసీ అంగీకరించింది. అంతేకాక ఇంగ్లాండ్ జట్టు కోల్పోయిన రివ్యూను తిరిగి ఇచ్చినట్లు ప్రకటించింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని ఐసీసీ తెలిపింది. అయితే కేరీ క్యాచ్ ఇచ్చే సమయానికి 72 పరుగులతో ఉన్నాడు. ఆ నిర్ణయం తర్వాత అతడు శతకం పూర్తి చేయడంతో, అంపైర్ నిర్ణయం ఇంగ్లాండ్‌కు భారీ నష్టం కలిగించింది. ఈ ఘటనపై ఇంగ్లాండ్ క్యాంప్ నుంచి వెంటనే తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో కూడా ఆసీస్ మరోసారి చీటింగ్ చేసిందంటూ కామెంట్స్ ఎక్కువయ్యాయి. ఇంగ్లాండ్ రివ్యూ సమయంలోనే బ్యాట్‌కు ఏదో తగిలిందని ఆసీస్ ప్లేయర్ కేరీ తెలపడం గమన్హారం.


అసలేం జరిగిందంటే?

మూడో టెస్టు(England vs Australia third Test) తొలి రోజు ఆటలో 63వ ఓవర్‌లో జోష్ టంగ్ వేసిన బంతిని ఆస్ట్రేలియా బ్యాటర్ ఆడగా.. వికెట్ కీపర్ జేమీ స్మిత్ క్యాచ్ పట్టాడు. అంపైర్ అహ్సాన్ రజాకు అప్పీల్ చేయగా.. దానిని తిరస్కరించారు. దీంతో బంతి పక్కాగా బ్యాటర్‌కు తగిలిందనే నమ్మకంతో ఇంగ్లాండ్ వెంటనే రివ్యూ కోరింది. 'స్నికోమీటర్'లో ఒక స్పైక్ కనిపించింది. కానీ అది బంతి బ్యాట్‌ను దాటడానికి 2-3 ఫ్రేమ్‌ల ముందు కనిపించింది. దీంతో మూడవ అంపైర్ ఆస్ట్రేలియాకు అనుకూలంగా తీర్పు ఇచ్చాడు. దీంతో డీఆర్ఎస్(DRS) వివాదం చెలరేగింది. మరోవైపు ఐసీసీ నిర్ణయంతో ఇంగ్లాండ్ జట్టు యాజమాన్యం సంతృప్తి చెందలేదు. తొలి రోజు ఆట ముగిసిన తర్వాత హెడ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్, టీమ్ మేనేజర్ వేన్ బెంట్లీ మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రోవ్‌తో చర్చలు జరిపారు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) కూడా తమ వ్యవస్థలను సమీక్షించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలిని (ICC) అభ్యర్థించింది. ఐసీసీ ప్రసార భాగస్వామి బీబీజీ స్పోర్ట్స్ ఈ వివాదంపై స్పందించింది. స్నికో మీటర్ ఆడియో క్యాలిబ్రేషన్‌లో లోపం ఉందని బీబీజీ స్పోర్ట్ కూడా అంగీకరించింది.


ఇవీ చదవండి:

Sarfaraz Khan: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్

పీఎం మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం

Updated Date - Dec 18 , 2025 | 07:19 PM