Crows: ఆహారం, నీరు ఇచ్చే వారికి కాకులు ప్రత్యేక బహుమతి ఇస్తాయా?
ABN , Publish Date - Dec 18 , 2025 | 03:37 PM
కాకుల పట్ల ఎవరు అంతగా ఆసక్తి కనబరచరు. కానీ వాటికి ఆహారం పెడితే.. పితృదేవతలకు పెట్టినట్లు అని పెద్దలు భావిస్తారు.
నల్లటి కాకి ఎక్కడ కనిపించినా తరిమివేస్తారు. దాని గొంతు లేదా ఆ నల్లని రూపాన్ని ఎవరూ ఇష్టపడరు, ఇతర పక్షులతో పోలిస్తే ఇది కొంచెం వింతగా ఉంటుంది. కాకులకు ఆహారం పెట్టే వారు చాలా తక్కువగా ఉంటారు. పర్యావరణాన్ని శుభ్రపరచడంలో కాకులు కీలక భూమిక పోషిస్తాయని చెబుతారు. మన పరిసరాల నుంచి మురికి తొలగించడంతోపాటు పరిశుభ్రతను కాపాడుకోవడంలో కాకులు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
ప్రతిఫలం ఇచ్చే గుణం..
కాకులకు ఆహారం పెట్టడం వల్ల మన పితృదేవతలకు శుభం కలుగుతుందని హిందూ మతంలో ప్రగాఢంగా విశ్వసిస్తారు. తమకు ఆహారం పెట్టిన వారికి.. తమపై దయ చూపిన వారికి ప్రతిఫలం ఇచ్చే గుణం కాకుల్లో ఉందంటారు.
తమపై ప్రేమ చూపించే వారికి బహుమతులు ఇస్తాయా..?
తమపై ప్రేమ చూపిన వారి కోసం కాకులు చిన్న చిన్న ఆభరణాలను వదిలి వెళ్తాయని చెబుతారు. ఆ జాబితాలో మెరిసే లోహం, గులకరాళ్లు, సీసా మూతలు, బటన్లు, ఉంగరాలు ఉంటాయి.
అసలు సత్యం ఇదేనా?
అత్యంత తెలివైన పక్షుల్లో కాకి ఒకటి. ఇవి మనుషుల ముఖాలను గుర్తిస్తాయి. వీటిలో జ్ఞాపక శక్తి అధికం. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. కాకులు అనేక ఏళ్లుగా తమను బెదిరించిన లేదా దయతో వ్యవహరించిన వ్యక్తుల ముఖాలను గుర్తించుకోగలవని తెలింది.
కాకులు తమకు సహాయం చేసే వారిని ఎందుకు గుర్తించుకొంటాయా?
మనుషుల ముఖాలను గుర్తించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎవరు స్నేహపూర్వకంగా ఉంటారు. ఎవరు బెదిరింపులకు పాల్పడతారనే వ్యక్తులను ఆవి గుర్తుంచుంకొంటాయి. అంటే.. క్రమం తప్పకుండా ఆహారం పెట్టే వారిని ఆవి గుర్తు పెట్టుకుంటాయి. కాలక్రమేణా వారిపై కాకులకు నమ్మకం పెరుగుతుంది.
కాకులతో సానుకూల సంబంధాన్ని ఎలా నిర్మించుకోవాలి?
ఒక స్థలం, సమయంలో వాటికి ఆహారం ఇవ్వడం.
వాటికి ఎల్లప్పుడూ సురక్షితమై ఆహార పదార్థాలు పెట్టాలి.
వాటిని తాకడానికి లేదా వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించవద్దు.
నోరు లేని జీవాలను ఆహారం పెట్టడం వల్ల వన్యప్రాణులతో సహజీవనం పెరుగుతుంది. మన చుట్టూ ఉన్న ప్రకృతిపై అవగాహన పెరుగుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
జోగి రమేష్ బ్రదర్స్‌కు దక్కని ఊరట
చిన్న గాటుతో గుండె ఆపరేషన్.. ఉచితంగా..
Read Latest Devotional News And Telugu News