Share News

SMSIMSR: చిన్న గాటుతో గుండె ఆపరేషన్.. ఉచితంగా..

ABN , Publish Date - Dec 17 , 2025 | 06:16 PM

శ్రీ మధుసూదన్‌ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (SMSIMSR) వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ అనే లక్ష్యంతో పని చేస్తోంది. ఈ ఆసుపత్రి వైద్యుల బృందం ఇటీవల ఉచితంగా నిర్వహించిన టోటల్ ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది.

SMSIMSR: చిన్న గాటుతో గుండె ఆపరేషన్..  ఉచితంగా..
SMSIMSR

సత్య సాయి గ్రామం/ ముద్దెనహళ్లి డిసెంబర్ 16: అత్యాధునిక కార్డియాక్ కేర్ కేవలం సంపన్నులకే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరికీ అందాలన్న దృక్పథంతో ‘వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ’ మిషన్‌ లక్ష్యంతో శ్రీ మధుసూదన్‌ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (SMSIMSR) పని చేస్తోంది. తాజాగా ఈ ఆసుపత్రిలో టోటల్ ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీని విజయవంతంగా నిర్వహించడం ద్వారా మరో మైలురాయిని సాధించింది. దాంతో ప్రపంచంలోనే ఈ శస్త్రచికిత్సను పూర్తి ఉచితంగా అందిస్తున్న తొలి ఆస్పత్రిగా SMSIMSR చరిత్ర సృష్టించింది.

Woman.jpg


భారతదేశంలో ఈ అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ చికిత్స అందిస్తున్న మూడో ఆసుపత్రిగా గుర్తింపు పొందింది. కోల్‌కతాలోని మణిపాల్ హాస్పిటల్స్ చీఫ్ ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ సందీప్ సర్దార్ బృందంతో కలిసి శ్రీ మధుసూదన్ సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ( SMSIMSR) హార్ట్ వాల్వ్ బ్యాంక్ డైరెక్టర్, చీఫ్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ సిఎస్ హిరేమత్ నేతృత్వంలో బెంగళూరుకు చెందిన యువతి (29) కి టోటల్ ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీని విజయవంతగా నిర్వహించారు. డిసెంబర్ 13వ తేదీన నిర్వహించిన శస్త్రచికిత్సతో చిన్న వయస్సులోనే పెద్ద ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్న ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చినట్లు అయింది.

SMSIMSR-2.jpg


SMSIMSR-1.jpgఈ శస్త్రచికిత్సను అత్యాధునిక పరికరాల సహాయంతో నిర్వహించారు. దీని ఫలితంగా.. గాయం పరిమాణం 2 సెం.మీ కన్న తక్కువ ఉండది. దీంతో రోగి వేగంగా కొలుకోవడానికి వీలు కలిగింది. అంటే ఈ శస్త్ర చికిత్స జరిగిన కేవలం రూ. 72 గంటల్లోనే ఆ యువతి డిశ్చార్జ్ అయింది. స్వల్ప గాయం చేయడం ద్వారా ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడంలో SMSIMSR నైపుణ్యం స్పష్టమవుతుంది. ఆరోగ్య సంరక్షణలో సాంకేతిక నైపుణ్యం, వినూత్న ఆవిష్కరణల ద్వారా సమాజ హితం కోసం అంకితభావంతో ముందు సాగుతున్న SMSIMSR, వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ నిబద్ధతకు అద్దం పడతాయంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.

endoscopy-1.jpg


ఈ ఆపరేషన్ ప్రత్యేకతలు..

1. SMSIMSR టోటల్ ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీని పూర్తి ఉచితంగా నిర్వహించింది. దీనితో ప్రతి ఒక్కరికీ అత్యాధునిక కార్డియాక్ కేర్ అందుబాటులో ఉంటుంది.

2. భారతదేశంలో టోటల్ ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీని నిర్వహించిన మూడో కేంద్రం. ప్రపంచంలోనే దీన్ని ఉచితంగా అందించే మొట్టమొదటి కేంద్రంగా SMSIMSR అవతరించింది.

3. గుండె సంబంధ శస్త్ర చికిత్సలో ఇది సరికొత్త మైలురాయి

ఈ వార్తలు కూడా చదవండి..

రాహు కేతు దోషం పోవాలంటే.. ఇలా సింపుల్‌గా..

ఇంతకీ మార్గశిర అమావాస్య ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..

For More Devotional News And Telugu News

Updated Date - Dec 17 , 2025 | 06:37 PM