Share News

Margasira Amavasya: ఇంతకీ మార్గశిర అమావాస్య ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..

ABN , Publish Date - Dec 09 , 2025 | 03:03 PM

మార్గశిర మాసం మరికొద్ది రోజుల్లో ముగుస్తోంది. ఈ మార్గ శిర అమావాస్య రోజు కొన్ని నియమాలు పాటిస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

Margasira Amavasya: ఇంతకీ మార్గశిర అమావాస్య ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..

Margasira Amavasya 2025: తెలుగు పంచాంగం ప్రకారం.. మార్గశిర అమావాస్యకు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ మార్గశిర అమావాస్య శుక్రవారం వచ్చింది. దీంతో ఈ రోజు విశేషంగా భావిస్తారు. ఈ రోజు శ్రీమహావిష్ణువును పూజించడంతోపాటు పితృదేవతలకు తర్పణాలు, దానధర్మాలు చేయడం ముఖ్యమని చెబుతారు. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని పండితులు వివరిస్తున్నారు.

ఈ మాసంలో శ్రీహరిని పూజించడం వల్ల సిరిసంపదలు, అష్ట ఐశ్వర్యాలు వృద్ధి చెందుతాయని నమ్ముతారు. కుటుంబ జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ అమావాస్య రోజు.. పితృదేవతలకు తర్పణం వదలడంతోపాటు శ్రాద్ధకర్మలు ఆచరిస్తారు. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని అంటారు.


మార్గశిర అమావాస్య తిథి, శుభ ముహూర్తం..

ఈ ఏడాది మార్గశిర అమావాస్ తిథి డిసెంబర్ 19వ తేదీ శుక్రవారం ఉదయం 4.59 గంటలకు ప్రారంభమవుతుంది. డిసెంబర్ 20వ తేదీ ఉదయం 07:13 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయాన్ని అనుసరించి..మార్గశిర అమావాస్యను డిసెంబర్ 19వ తేదీ శుక్రవారం జరుపుకుంటారు.


పూజా చేయాల్సిన విధానం..

ఈ అమావాస్య రోజు.. వేకువజామున నిద్ర లేచి ప్రవహించే నదిలో స్నానం ఆచరించాలి. అనంతరం సూర్యుడికి ఆర్ఘ్యాం వదిలి.. ప్రార్థించాలి. ఇంట్లోని పూజ గదిలో పీఠం ఏర్పాటు చేసి.. దానిపై పసుపు రంగు వస్త్రం ఉంచాలి. విష్ణుమూర్తి చిత్రపటాన్ని ఉంచాలి. ఈ పటం ముందు అవు నెయ్యితో అఖండ దీపం వెలిగించాలి. ఆ చిత్ర పటాన్ని పువ్వులు, పండ్లతోపాటు స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత విష్ణు సహస్రనామాన్ని చదవాలి. మరి ముఖ్యంగా ఈ రోజు గజేంద్ర మోక్ష కథ చదవడం శుభప్రదం. చివరగా దేవుడికి హరతి ఇవ్వాలి.


పితృదేవతలకు తర్పణంతోపాటు దానధర్మాలు

ఈ విశేషమైన రోజున పూర్వీకులకు శ్రాద్ధం, తర్పణం సమర్పించాలి. పిండి దీపాలు వెలిగిస్తే.. మరింత మంచిది. అలాగే ఈ రోజు రావి చెట్టు వద్ద దీపం వెలిగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు వివరిస్తున్నారు. జాతకంలో శని, పితృదోషాలు వల్ల ఇబ్బందులు కలుగుతుంటే.. ఆహారం, దుప్పట్లు, నువ్వులు వంటి వస్తువులను దానంగా ఇవ్వాలి. కాల సర్పదోషంతో బాధపడుతున్న వారు.. ఈ రోజు ఉపవాస దీక్ష చేయడం వల్ల శుభ ఫలితాలు అందుకోవచ్చు.


గమనిక: ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగతం. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీటిని ధృవీకరించదని మనవి.

ఈ వార్తలు కూడా చదవండి..

జాక్‌పాట్ కొట్టనున్న ఈ రాశులు.. పట్టిందల్లా బంగారమే..!

ఈ రాశులకు రాజయోగం..

For More Devotional News And Telugu News

Updated Date - Dec 09 , 2025 | 03:06 PM