Share News

Fifa World Cup 2026: ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేతకు రూ.451 కోట్లు

ABN , Publish Date - Dec 19 , 2025 | 06:49 AM

2026లో జరిగే ప్రపంచ ఫుట్‌బాల్ విజేత జట్టుకు ఫిఫా రూ.451 కోట్ల ప్రైజ్‌మనీ ఇవ్వనుంది. 2022 వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనా రూ.379కోట్లు లభించాయి. గతసారితో పోలిస్తే ఈ సారి నగదు బహుమతిని ఫిఫా 48.9శాతం పెంచింది.

Fifa World Cup 2026: ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేతకు రూ.451 కోట్లు
Fifa World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: 2026 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేత జట్టుకు కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ దక్కనుంది. రికార్డు స్థాయిలో రూ.451 కోట్లు ఇవ్వనున్నారు. 2022 ప్రపంచ కప్ గెలిచిన అర్జెంటీనాకు రూ.379 కోట్లు లభించాయి. గత సారితో పోలిస్తే ఈ సారి నగదు బహుమతిని ఫిఫా(Fifa World Cup 2026:) 48.9శాతం పెంచింది. 2022 కప్‌లో మొత్తం ప్రైజ్‌మనీ రూ.3971 కోట్లు కాగా.. ఈ సారి రూ.5911 కోట్లకు పెంచారు.


గ్రూప్ దశలో 48 జట్లు పోటీపడనున్నాయి. జట్టుకు రూ.81 కోట్ల చొప్పున దక్కనున్నాయి. ఈ టోర్నీ సన్నద్ధత కోసం ప్రతి జట్టుకు రూ.13.53కోట్లు లభిస్తాయి. రౌండ్ ఆఫ్ 32 దశకు చేరే జట్లకు రూ.99.27 కోట్ల చొప్పున.. ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించే టీమ్‌లకు రూ.135 కోట్ల చొప్పున లభిస్తాయి. క్వార్టర్స్ చేరే జట్లకు రూ.171 కోట్ల చొప్పున దక్కుతాయి. నాలుగో స్థానంలో నిలిచే జట్టు రూ.243 కోట్లు, మూడో స్థానాన్ని సాధించే టీమ్ రూ.261 కోట్లు సంపాదిస్తాయి. రన్నరప్‌కు రూ.297 కోట్లు లభిస్తాయి. ప్రపంచ కప్ విజేతతో పోలిస్తే క్లబ్ ప్రపంచ కప్‌లో గెలిచే జట్టుకే ఎక్కువ నగదు బహుమతి దక్కనుంది. 2025 క్లబ్ ప్రపంచ కప్ నెగ్గిన చెల్సీకి రూ.1128 కోట్లు లభించాయి. జాతీయ జట్లతో పోలిస్తే క్లబ్ జట్ల నిర్వహణకు ఎక్కువ ఖర్చులు అవుతుండటంతో ఫిఫా అందుకు తగ్గట్టే ప్రైజ్‌మనీ అందిస్తోంది.


ఇవీ చదవండి:

Sarfaraz Khan: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్

Ashes DRS Controversy: యాషెస్ సిరీస్‌లో స్నికో మీటర్‌ వివాదం.. స్పందించిన ఐసీసీ

Updated Date - Dec 19 , 2025 | 06:49 AM