India Eyes Series Win In Final T20: ఆఖరాటలో అదరగొడతారా
ABN , Publish Date - Dec 19 , 2025 | 06:36 AM
భారత్‌లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు సుదీర్ఘ పర్యటనకు నేటితో తెరపడనుంది. ఇరు జట్ల మధ్య శుక్రవారం ఆఖరి టీ20 మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే 2-0తో సఫారీలు...
ఉత్సాహంగా భారత్
సిరీస్ సమం కోసం సఫారీల ఆరాటం
శాంసన్‌కు అవకాశం?
రాత్రి 7.00 గం. నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో...
అహ్మదాబాద్: భారత్‌లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు సుదీర్ఘ పర్యటనకు నేటితో తెరపడనుంది. ఇరు జట్ల మధ్య శుక్రవారం ఆఖరి టీ20 మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే 2-0తో సఫారీలు టెస్టు సిరీ్‌సను, 2-1తో భారత్ వన్డే సిరీ్‌సను గెల్చిన విషయం తెలిసిందే. ఇక తాజా ఐదు టీ20ల సిరీ్‌సలో టీమిండియా ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉంది. నాలుగో టీ20 పొగ మంచు కారణంగా రద్దు కావడంతో ఫలితం తేలలేదు. దీంతో నేటి చివరి మ్యాచ్‌లో భారత్ గెలిస్తే వరుసగా మరో సిరీ్‌సను దక్కించుకున్నట్టవుతుంది. అటు పర్యాటక జట్టుకు మాత్రం సిరీ్‌సను గెలిచే అవకాశం లేదు. కాకపోతే చక్కటి విజయంతో సిరీ్‌సను సమం చేసి టూర్‌ను సంతృప్తికరంగా ముగించాలనుకుంటోంది.

సంజూను ఆడిస్తారా?
నెట్స్‌లో గాయపడిన వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాలుగో టీ20కి అందుబాటులో ఉండడని ముందే ప్రకటించారు. అయితే ఆ మ్యాచ్ రద్దు కాగా.. తను జట్టుతో పాటే అహ్మదాబాద్‌కు చేరడం చర్చనీయాంశమైంది. కానీ ఆఖరి టీ20లో అతను ఆడే విషయమై స్పష్టత లేదు. సంజూ శాంసన్‌ను బెంచీకే పరిమితం చేస్తూ విఫలమవుతున్న గిల్‌ను ప్రతీ మ్యాచ్‌లో ఆడిస్తుండడంపై ఇప్పటికే అభిమానులు, విశ్లేషకుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో శాంసన్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించే అవకాశం లేకపోలేదు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్‌లేమి కొనసాగుతూనే ఉంది. సారథిగా జట్టును విజయపథంలో నడిపిస్తున్నా, వ్యక్తిగత ఆటతీరు మాత్రం విమర్శలపాలవుతోంది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. ఇక పేసర్ బుమ్రా జట్టులో చేరడం సానుకూలాంశం కానుంది. మరో పేసర్ హర్షిత్‌ను కొనసాగిస్తారా? లేక స్పిన్నర్ సుందర్‌ను ఆడిస్తారా? వేచిచూడాల్సిందే.
బ్యాటింగ్ మెరుగైతేనే..
ఈ సిరీ్‌సలో దక్షిణాఫ్రికా జట్టు పడుతూలేస్తూ సాగుతోంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో నిలకడలేమి కనిపిస్తోంది. ఆఖరి మ్యాచ్‌లోనైనా సమష్టి ఆటతో భారత్‌ను ఎదుర్కోవాలనుకుంటోంది. ఓపెనర్‌గా హెన్‌డ్రిక్స్ వరుసగా నిరాశపరుస్తుండడంతో కెప్టెన్ మార్‌క్రమ్ ఆ స్థానంలో ఆడే అవకాశం ఉంది. మరో ఓపెనర్ డికాక్ రెండో మ్యాచ్‌లో మాత్రమే చెలరేగాడు. అతను ఫామ్ అందుకుంటే బౌలర్లకు కష్టమే. అలాగే హిట్టర్లు బ్రెవిస్, మిల్లర్ కూడా సిరీ్‌సలో ఆకట్టుకోలేకపోయారు. పేస్ ఆల్‌రౌండర్ యాన్సెన్ బౌలింగ్‌లో ఫర్వాలేదనిపిస్తున్నా.. బ్యాటింగ్‌లో మెరుపులు కరువయ్యాయి. పేసర్లలో నోకియా విఫలమవుతున్నా ఎన్‌గిడి, బార్ట్‌మన్ భారత్‌ను ఇబ్బంది పెడుతున్నారు.
తుది జట్లు (అంచనా)
భారత్: అభిషేక్, గిల్/శాంసన్, సూర్య కుమార్ (కెప్టెన్), తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, దూబే, హర్షిత్/సుందర్, అర్ష్‌దీప్, బుమ్రా, వరుణ్.
దక్షిణాఫ్రికా: డికాక్, మార్‌క్రమ్ (కెప్టెన్), హెన్‌డ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, యాన్సెన్, బాష్, లిండే/నోకియా, ఎన్‌గిడి, బార్ట్‌మన్.
పిచ్, వాతావరణం
అహ్మదాబాద్‌లో 30 డిగ్రీల అధిక వేడితో కూడిన వాతావరణం ఉంటుంది కాబట్టి ఇక్కడ పొగ మంచు సమస్య కాబోదు. దీంతో మ్యాచ్‌కు ఎలాంటి ఆటంకం లేదు. మోదీ స్టేడియం పిచ్ సహజంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంటుంది. ఈనేపథ్యంలో భారీ స్కోర్లు ఖాయమే.
ఇవీ చదవండి:
Sarfaraz Khan: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్
Ashes DRS Controversy: యాషెస్ సిరీస్‌లో స్నికో మీటర్ వివాదం.. స్పందించిన ఐసీసీ