IND vs SA: టాస్ పడకుండానే నాలుగో టీ20 మ్యాచ్ రద్దు..
ABN , Publish Date - Dec 17 , 2025 | 09:46 PM
భారత్, సౌతాఫ్రికా జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ టాస్ పడకుండానే రద్దైంది. పొగమంచు కారణంగా మ్యాచ్ ప్రారంభం కాకుండానే ముగిసింది. లక్నో నగరంతో పాటు మ్యాచ్ జరిగే స్టేడియాన్ని పొగమంచు కమ్మేయడంతో పలుమార్లు మైదానానికి వచ్చిన అంపైర్లు.. పరిస్థితిని పర్యవేక్షించి.. చివరకు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: లక్నో వేదికగా భారత్ , సౌతాఫ్రికా మధ్య ఇవాళ(బుధవారం) జరగాల్సిన నాలుగో టీ20 టాస్ పడకుండానే రద్దైంది. పొగమంచు కారణంగా మ్యాచ్ మొదలుకాకుండానే ముగిసిపోయింది. లక్నో నగరంతో పాటు మ్యాచ్ జరిగే స్టేడియాన్ని పొగమంచు కమ్మేయడంతో పలుమార్లు మైదానానికి వచ్చిన అంపైర్లు.. పరిస్థితిని పర్యవేక్షించారు. ఇవాళ సాయంత్రం 6.30 నిమిషాలకు టాస్ పడాల్సి ఉండగా.. పొగ మంచు కారణంగా తొలుత ఆలస్యమైంది. ఈ క్రమంలో వరుస విరామాల్లో అంపైర్లు వచ్చి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా 6.50 నిమిషాలకు ఓసారి.. 7.30 నిమిషాలకు మరోసారి, 8 గంటలకు.. అనంతరం 8.30 నిమిషాలకు.. మైదానంలోకి వచ్చిన అంపైర్లు పరిస్థితిని సమీక్షించారు.
ఈ క్రమంలో పిచ్‌పై కవర్లు కప్పి ఉంచాలని సూచించారు. అనంతరం 9 గంటలకు మరోసారి అప్లైరు రివ్యూ చేశారు. ఈ క్రమంలో మ్యాచ్ జరుగుతుందని ప్రేక్షకులు భావించారు. ఈసారి 9.25 నిమిషాలకు మరోసారి రివ్యూ చేస్తామని చెప్పి మైదానం వీడారు. ఈ క్రమంలో... 9.25 నిమిషాలకు మరోసారి మైదానంలోకి వచ్చి పరిస్థితి పరిశీలించిన తర్వాత మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో అభిమానులు నిరాశగా వెనుదిరిగారు. ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఐదో టీ20 మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. డిసెంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది.
ఇవీ చదవండి:
Sarfaraz Khan: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్
పీఎం మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం