Home » Congress
తమిళనాడులో సీఎం సి.విజయ్ నేతృత్వంలోని కూటమికి అధికారికంగా ఎస్ఎస్‌జేవీఏ అనే పేరు ఖరారైంది. మొత్తం 5 పార్టీలు ఇందులో భాగమయ్యాయి.
తెలంగాణలో పరిస్థితులను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు వివరించినట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఈరోజు గవర్నర్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు.
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివరణ ఇచ్చారు.
కేసీఆర్ ఫాంహౌస్ వద్ద ‘శుద్ధి’ అంశం తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర రచ్చకు దారి తీసింది. బీఆర్‌ఎస్ తీరుపై మంత్రులు మండిపడ్డారు. స్పీకర్‌ను అవమానించడం, నిరసన ప్రాంతాన్ని శుద్ధి చేయడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో మాట్లాడారు.
తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల అంశం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంలో ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డికి ఊరట లభించింది. వారిద్దరి రిమాండ్‌ను హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు తిరస్కరించింది.
గజ్వేల్ నియోజకవర్గంలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు డప్పు చప్పుళ్లతో ఫాంహౌస్ ముట్టడికి యత్నించారు. దీంతో వారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు.
స్పీకర్‌ను బీఆర్‌ఎస్‌ను అవమానించిందని, క్షమాపణ చెప్పాల్సిందే అని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. దళితులను బీఆర్‌ఎస్ అవమానించిందని, కేసీఆర్ సభకు రావాలని డిమాండ్ చేసింది.
తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దాడిలో గాయపడ్డ మహిళా పోలీసులను మంత్రి సీతక్క పరామర్శించారు. జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను మంత్రికి మహిళా పోలీసు అధికారులు వివరించారు.
తెలంగాణలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీలు ఖండించారు. న్యూఢిల్లీలోని ఏఐసీసీ ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల సమావేశం జరిగింది. వివిధ రాష్ట్రాలకు చెందిన 32 మంది ఎంపీలు ఈ సమావేశానికి హాజరై.. ఎస్సీ, ఎస్టీ ఎంపీల కోసం ప్రత్యేక ఫోరంను ఏర్పాటు చేశారు.