AP News: మంత్రిగా నేను చేయని పని ఓ అమ్మాయి సాధించింది: రఘువీరారెడ్డి
ABN , Publish Date - Jan 01 , 2026 | 07:34 PM
మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు రఘువీరారెడ్డి.. మహిళల అంధుల క్రికెట్ టీం కెప్టెన్ దీపికపై ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా తాను చేయని పనిని భారత అంధ క్రికెట్ కెప్టెన్ దీపిక సాధించిందని..
శ్రీ సత్యసాయి జిల్లా, జనవరి 1: మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు రఘువీరారెడ్డి.. మహిళల అంధుల క్రికెట్ టీం కెప్టెన్ దీపికపై ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా తాను చేయని పనిని భారత అంధ క్రికెట్ కెప్టెన్ దీపిక సాధించిందని కొనియాడుతూ కరతాళ ధ్వనులతో దీపికకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి దంపతులు గ్రామస్తులతో కలసి ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత క్రికెట్ కెప్టెన్ దీపికను ఆహ్వానించారు. గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో సరదాగా దీపికతో రఘువీరారెడ్డి క్రికెట్ ఆడారు. అనంతరం అభినందన సభలో దీపికను సత్కరించారు. ఇదే సమయంలో చిన్ననాటి గురువులకు రఘువీరా పాదాభిషేకం చేసి దీవెనలు పొందారు. ఈ సందర్భంగా గురువుతో బెత్తంతో కొట్టించుకుని రఘువీరా ఆయన మిత్రబృందం పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
సభను ఉద్దేశించి మాట్లాడిన రఘువీరా రెడ్డి.. గతంలో తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగిన మడకశిర నియోజకవర్గంలోని తంబాలహట్టికు రోడ్డు వేయలేకపోయానని అన్నారు. తాను చేయని పనిని దీపిక రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరి తన సొంత గ్రామానికి ఆరున్నర కోట్ల నిధులతో రోడ్డు మంజూరు చేయించుకుందని అభినందించారు.
Also Read:
బాబోయ్.. గంజాయి ఇలా కూడా పండిస్తారా.. యువకుడు తెలివితేటలు మామూలుగా లేవుగా..
ఓర్నీ.. రీల్స్ కోసం ప్రాణాలను ఫణంగా పెడతారా.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
గ్యాస్ వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు.