Gas Cylinder Prices Rise: గ్యాస్ వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు
ABN , Publish Date - Jan 01 , 2026 | 06:16 PM
గ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చేలా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. జనవరి 1వ తేదీనుంచి 19 కేజీల గ్యాస్ సిలిండర్‌పై ఏకంగా 111 రూపాయలు పెరిగింది.
కొత్త సంవత్సరం ప్రారంభమైన మొదటి రోజే గ్యాస్ వినియోగదారులకు ఊహించని షాక్ తగిలింది. గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. జనవరి 1వ తేదీనుంచి 19 కేజీల గ్యాస్ సిలిండర్‌పై ఏకంగా 111 రూపాయలు పెరిగింది. ఈ పెంపు కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు మాత్రమే వర్తించనుంది. డొమస్టిక్ గ్యాస్ సిలండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు ఉండదు. పలు మెట్రో నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు ఇలా ఉన్నాయి.. ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1580 రూపాయల నుంచి ఏకంగా 1691 రూపాయలకు పెరిగింది.
ముంబైలో 1531 రూపాయల నుంచి 1642 రూపాయలకు పెరిగింది. కోల్‌కతాలో 1684 రూపాయల నుంచి 1795 రూపాయలకు పెరిగింది. చెన్నైలో 1739 రూపాయల నుంచి 1849 రూపాయలకు పెరిగింది. అయితే, గత నెలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై దేశ రాజధాని ఢిల్లీలో 10 రూపాయలు.. ముంబై, చెన్నై నగరాల్లో 11 రూపాయలు తగ్గింది. నవంబర్ నెలలో కూడా గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. ఇప్పుడు మాత్రం ఊహించని విధంగా భారీగా పెరిగాయి.
భారీగా తగ్గిన జెట్ ఫ్యూయల్ ధరలు
విమానాల్లో వాడే ఇంధనం ఏటీఎఫ్ ధర భారీగా తగ్గింది. గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా భారత చమురు కంపెనీలు ఏటీఎఫ్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో జెట్ ఫ్యూయల్ ధర కిలో లీటర్‌కు 7.3 శాతం తగ్గింది. నిన్న 97 వేల రూపాయల దగ్గర ఉన్న ధర ఈ రోజు 7,353 రూపాయలు తగ్గి 92,323 రూపాయలుగా ఉంది. డిసెంబర్ 1వ తేదీన మాత్రం చమురు కంపెనీలు ఏకంగా 5.4 శాతం ఫ్యూయల్ రేటును పెంచేశాయి. అంతకు ముందు అక్టోబర్ నెలలో 3.3 శాతం.. నవంబర్ నెలలో 1 శాతం పెంచాయి.
ఇవి కూడా చదవండి
ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా...?
బేకింగ్ సోడా vs బేకింగ్ పౌడర్.. వీటిని ఎప్పుడు ఉపయోగించాలి ?