Share News

Viral stunt video: ఓర్నీ.. రీల్స్ కోసం ప్రాణాలను ఫణంగా పెడతారా.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

ABN , Publish Date - Jan 01 , 2026 | 06:40 PM

సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Viral stunt video: ఓర్నీ.. రీల్స్ కోసం ప్రాణాలను ఫణంగా పెడతారా.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
risked life for reels

ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (dangerous reels video).


@brijeshchaodhry అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం ఒక వ్యక్తి నడిరోడ్డు మీద అత్యంత ప్రమాదకర సాహసం చేస్తూ బైక్ నడుపుతున్నాడు. ఒక వ్యక్తి తన శరీరం మొత్తాన్ని గడ్డితో చుట్టుకుని బైక్ పై వెళ్తున్నాడు. బైక్ హ్యాండిల్ బార్లకు రెండు కుండలను కట్టాడు. అలాగే వెనకాల కూడా ఓ కుండ పెట్టాడు. ఆ నాలుగు కుండల్లోనూ నిప్పు వెలిగించాడు. అలాగే తన తలపై పెట్టుకున్న డబ్బాలో కూడా నిప్పు వెలిగించి మంటలు చెలరేగుతుండగా బైక్ మీద వేగంగా వెళ్తున్నాడు (dangerous social media trends).


అతడి స్నేహితులు ఆ ప్రమాదకర స్టంట్‌ను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (risked life for reels). ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. 'రీల్ కోసం ఇంత సాహసమా, జీవితం చాలా విలువైనది సోదరా' అని ఒకరు సూచించారు. ఇతడు దేశీ ఘోస్ట్ రైడర్ అని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 516ల మధ్యలో 519 ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెట్టండి..


సౌదీ అరేబియాలో మంచు వర్షం.. ఆ అందాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా..

Updated Date - Jan 01 , 2026 | 07:08 PM