AP Congress: ఏపీలో డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్
ABN , Publish Date - Jan 03 , 2026 | 09:53 PM
ఆంధ్రప్రదేశ్ జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులను పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం నాడు ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. జిల్లాలు, ముఖ్య పట్టణాలకు కలిపి 41 మంది అధ్యక్షుల పేర్లను ఏఐసీసీ ప్రకటించింది.
న్యూఢిల్లీ, జనవరి 3: ఆంధ్రప్రదేశ్ జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులను పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం నాడు ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. జిల్లాలు, ముఖ్య పట్టణాలకు కలిపి 41 మంది అధ్యక్షుల పేర్లను ఏఐసీసీ ప్రకటించింది. వీరి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటనలో స్పష్టం చేశారు కేసీ వేణుగోపాల్. ప్రతి జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన ఏఐసీసీ పర్యవేక్షకులు.. అనేక సమీక్షలు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు, ముఖ్య వ్యక్తులతో చర్చలు జరిపి సమగ్ర నివేదికను సమర్పించారని.. ఆ నివేదికల ఆధారంగా కొత్త అధ్యక్షులను నియమిచండం జరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు.
కొత్త అధ్యక్షులు వీరే..
1. అల్లూరి సీతారామరాజు - సతక బుల్లిబాబు
2. అనకాపల్లి - బొడ్డు శ్రీనివాస్
3. అనంతపురం - వై. మాధుసూధన్ రెడ్డి
4. అనంతపురం సిటీ - షేక్ ఇమామ్ వలి
5. అన్నమయ్య (రాజంపేట్) - గాజుల భాస్కర్
6. బాపట్ల - అమాంచి కృష్ణ మోహన్
7. చిత్తూరు - దెయ్యాల రమేష్ బాబు
8. చిత్తూరు సిటీ - జి. టికరామ్
9. డాక్టర్ అంబేద్కర్ కొనసీమ - కోతూరి శ్రీనివాస్
10. తూర్పుగోదావరి (రాజమహేంద్రవరం) - బోడ లక్ష్మీ వెంకట ప్రసన్న
11. ఏలూరు - రాజనాల రమ్మోహన్ రావు
12. ఏలూరు సిటీ - పి. బాల వెంకట సుబ్రహ్మణ్యం
13. గుంటూరు - సుధీర్ బాబు యెన్నం.
14. గుంటూరు సిటీ - షేక్ మహమ్మద్ ఇఫ్తికార్ అహ్మద్ (ఖలీల్)
15. కడప సిటీ - సయ్యద్ గౌస్ పీర్
16. కాకినాడ - మడేపల్లి సత్యానంద రావు
17. కాకినాడ సిటీ - చెక్కా నూక రాజు
18. కృష్ణ (మాచిలిపట్నం) - అందె శ్రీరామ్ మూర్తి
19. కర్నూల్ - క్రాంతి నాయుడు
20. కర్నూల్ సిటీ - ఎస్. జిలాని
21. మచిలీపట్నం - అబ్దుల్ మతీన్
22. మన్యం - వంగల దాలి నాయుడు
23. నంద్యాల - డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి
24. నెల్లూరు సిటీ - షేక్ అల్లాభక్ష్
25. ఎన్టీఆర్(విజయవాడ) - బొర్ర కిరణ్
26. ఒంగోలు సిటీ - దేవిరెడ్డి ఆదినారాయణ
27. పల్నాడు (నరాసారావుపేట) - అలెగ్జాండర్ సుధాకర్
28. ప్రకాశం (ఒంగోలు) షేక్ సైదా
29. రాజమండ్రి సిటీ - బి. మురళీధర్
30. పొట్టిశ్రీరాములు నెల్లూరు - నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి
31. శ్రీ సత్యసాయి (హిందూపూర్) - కేఎస్. షన్వాజ్
32. శ్రీకాకుళం - సనపాల అన్నాజి రావు
33. శ్రీకాకుళం సిటీ - రెళ్ల సురేశ్
34. తిరుపతి - బాలగురువం బాబు
35. తిరుపతి సిటీ - గౌడపేరు చిట్టిబాబు
36. విజయవాడ సిటీ - నరహరి శెట్టి నరసింహారావు
37. విశాఖపట్నం - అడ్డాల వెంకట వర్మ రాజు
38. విజయనగరం - మరిపి విద్య సాగర్
39. విజయనగరం సిటీ - శ్రీనివాసరావు
40. పశ్చిమగోదావరి (నరసాపురం) - అంకెం సీతారాం
41. వైఎస్ఆర్ కడప - విజయ జ్యోతి.
Also Read:
CM Revanth Reddy: ఎమ్మెల్యేల ప్రవర్తనపై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
Bihar Girls: రూ.20,000కే బిహార్ అమ్మాయిలు.. మంత్రి భర్త వివాదాస్పద వ్యాఖ్యలు
AP News: నగదు రహిత వైద్య సేవల్లో పురోగతి: మంత్రి సత్యకుమార్