AP News: నగదు రహిత వైద్య సేవల్లో పురోగతి: మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Jan 03 , 2026 | 08:42 PM
కూటమి ప్రభుత్వ పాలనలో నగదు రహిత వైద్య సేవల్లో భారీ పురోగతి సాధించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శనివారం నాడు వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
అమరావతి, జనవరి 3: కూటమి ప్రభుత్వ పాలనలో నగదు రహిత వైద్య సేవల్లో భారీ పురోగతి సాధించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శనివారం నాడు వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ వ్యయంలో 60 శాతం పెరుగుదల నమోదైందన్నారు. లబ్ధిదారుల సంఖ్య 21 శాతం పెరిగందన్నారు. నిర్దేశిత సమయంలో రోగుల వద్దకు 108 వాహనాలు చేరుకుంటున్నాయని మంత్రి తెలిపారు. అగ్రిమెంట్ ప్రకారం 95 శాతం రోగులను గంటలో ఆస్పత్రులకు 108 అంబులెన్స్‌లు చేరుస్తున్నాయన్నారు. 104 వాహనాల ద్వారా త్వరలోనే ఇంటి వద్దనే 41 వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
Also Read:
అసెంబ్లీలో తేల్చుకుందాం రండి.. బీఆర్ఎస్ నేతలకు సీఎం సవాల్
లిక్కర్ స్కామ్‌లో బెయిల్‌పై విడుదలైన చైతన్య బఘేల్
ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారా? చాలా డేంజర్..